Tarak: భార్యను ముద్దు పెట్టుకున్న తారక్.. ఫోటో వైరల్!

Tarak: ఆర్ఆర్ఆర్ సినిమా ద్వాారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. ఈ ఏడాది ఆ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ఆ సినిమాకు ముందు తారక్ సినిమా వచ్చి 3 ఏళ్లు అయ్యింది. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ గా తారక్ కనిపించి అందర్నీ కనువిందు చేశాడు. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీముడో పాట ఎంతగానో ఆకట్టుకుంది. అందులో తారక్ నటన అదుర్స్ అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసే అవకాశం కూడా ఉంది. దీని గురించి కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలు మొదలయ్యేలోపు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేస్తున్నారు.

కొరటాల శివ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ వెళ్లాడు. ఆయన విదేశాల నుంచి జనవరిలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ మధ్య కొన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం తారక్ జపాన్ అంతా తిరిగాడు. ఆ తర్వాత ఇప్పుడు యూఎస్ కు వెళ్లిపోయాడు.

 

యూఎస్ లోని మియామీ బీచ్ హోటల్ లో తన భార్య లక్ష్మీ ప్రణతిని ముద్దుపెట్టుకుంటూ తారక్ రొమాంటిక్ ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో అతని పెద్ద కొడుకు భార్గవ్ రామ్ తీసినట్టు తారక్ తెలిపాడు. ఈ ఫోటోను చూసి తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -