Tarak-Rajamouli: మనిద్దర జర్నీ ఇక మొదలు.. తారక్ ట్వీట్‌కు జక్కన్న సూపర్ రిప్లై..!

Tarak-Rajamouli: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ.. పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. వసూళ్ల పరంగా టాప్–3 ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇటీవల జపాన్ లోనూ రిలీజైన ఈ చిత్రం.. అక్కడా తన సత్తాను చాటింది.

జపాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ‘ఆర్ఆర్ఆర్’.. అక్కడ రిలీజైన నెల రోజుల్లోనే సుమారు రూ.18 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలోనే గాక నెట్ ఫ్లిక్స్ లో ఈ జక్కన్న మూవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియెన్స్ కు ‘ఆర్ఆర్ఆర్’ తెగ నచ్చేసింది. వాళ్లంతో ఈ మూవీలో ట్రాన్స్ లో నుంచి ఇంకా బయట పడలేకపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో కొన్ని నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ టాప్ లో నిలిచిందంటేనే.. ఈ సినిమా పరదేశీ సినీ ప్రియులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

జక్కన్నకు ప్రశంసల వెల్లువ
ఇకపోతే, హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు గానూ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో జక్కన్నకు అభినందనలు చెబుతూ సినీ ప్రియులుతోపాటు సెలబ్రిటీలు కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ జాబితాలో స్టార్ హీరో ఎన్టీఆర్‌ కూడా చేరారు.

మన జర్నీ మొదలు..: రాజమౌళి
రాజమౌళికి అవార్డు వచ్చిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘అభినందనలు జక్కన్న. మీ కీర్తి ప్రపంచవ్యాప్తం కావడానికి ఇది ఆరంభం మాత్రమే. ఇన్నేళ్ల మన ప్రయాణంలో మీ గురించి నాకు తెలిసినదంతా.. ఈ ప్రపంచానికి కూడా తెలియాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై రాజమౌళి స్పందించారు. ‘హహ్హహ్హ.. తారక్‌ చిన్న కరెక్షన్‌. ఇది మన ప్రయాణానికి ఆరంభం’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అయింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -