Tarak Son: ఎన్టీఆర్ కొడుకు ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarak Son: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి తారక్ కెరీర్‌లో ఫ్లాప్ అన్నది లేదు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలతో వరుస హిట్లను అందుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అయితే పాన్ వరల్డ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తారక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొమరం భీముడో అనే సాంగ్ లో తారక్ హవాభావాలు అతనిలో పరిణితి చెందిన నటుడిని చూపాయని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు.

ఎన్టీఆర్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే నార్నె శ్రీనివాసరావు కుమార్తె నార్తె ప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీళ్ల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు అభయ్ కాగా చిన్న కొడుకు పేరు భార్గవ్. తండ్రి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయితే అతడి పిల్లలు కూడా సినిమాల పట్ల మక్కువగానే ఉంటారని అందరూ అనుకుంటారు. ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే చాలా మంది డాడీనే అని టక్కున సమాధానం చెప్తారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్టీఆర్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సమయంలో ఒకసారి తన పెద్ద కుమారుడు అభయ్‌ను కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో తన ఫేవరెట్ హీరో, ఫేవరెట్ మూవీ గురించి బయటపెట్టాడు. అయితే అభయ్ తన ఫేవరెట్ హీరో మహేష్‌బాబు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్చపోయారు. తన ఫేవరెట్ మూవీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన బిజినెస్ మేన్ అని చెప్పాడు. దీంతో తారక్, మహేష్ అభిమానులు అభయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే ఇండస్ట్రీలో తారక్, మహేష్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది.

 

ఎన్టీఆర్, తారక్ కలిసి నటిస్తారా?

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా, నందమూరి ఫ్యామిలీలకు చెందిన హీరోలు కలిసి నటించారు. దీంతో భవిష్యత్‌లో తారక్, మహేష్ కూడా కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే గత ఏడాది మీలో ఎవరు కోటీశ్వరుడు షో సందర్భంగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షోకు మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ టీఆర్పీలలో మంచి రేటింగ్ కూడా సాధించింది. మహేష్‌ను తారక్ ఎంతో ఇష్టంగా అన్న అని పిలుస్తుంటాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో తారక్, మహేష్ అన్నదమ్ములుగా నటించే అవకాశాలున్నాయని అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -