Tarak: కొరటాల మూవీలో తారక్ ఇద్దరు కొడుకులు.. సంతోషంలో ఫ్యాన్స్!

Tarak: అంతర్జాతీయ ఖ్యాతి పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అందులో నటించిన తారక్, రామ్ చరణ్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రత్యేకంగా తారక్ నటన చాలా మందికి కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ సినిమా కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది తన 30వ సినిమా కావడం విశేషం.

 

అందుకే తారక్ తన 30వ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఆ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. అయితే సినిమా మీద మాత్రం అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేక విషయం కూడా ఉంది. ఇది తారక్ అభిమానులకు పండగలాంటి వార్తేనని చెప్పాలి.

 

ఎన్టీఆర్ కొరటాలతో చేస్తున్న సినిమాలో తారక్ తన ఇద్దరు కొడుకులను కూడా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఇద్దరు కొడుకులకూ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. కొరటాల శివ చెప్పిన కథ తారక్ కు చాలా బాగా నచ్చేసిందని, అందుకే షూటింగ్ కి కొంత సమయం పడనుందని తెలుస్తోంది.

 

తారక్, కొరటాల సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. కానీ ఇందులో తారక్ ఇద్దరు కొడుకులు నటించనున్నట్లు సమాచారం. కొరటాల స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కొంత కాలం ఓపిగ్గా ఎదురుచూస్తున్నారట. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని కొరటాల ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్ విషయంలో కూడా కాస్త టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని అనుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకులు నటిస్తున్నారని తెలియడంతో తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -