Tarak: తారక్ దిమ్మతిరిగే ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarak: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ పాన్ వరల్డ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ సినిమా స్టోరీ ఎంపిక విషయంలో ఎంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. అలాగే ఒకే సినిమాకు తొమ్మిది నెలల సమయం కేటాయించడంతో ఇకపై వేగంగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో 5 సినిమాలు రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా గ్యాప్‌ను కవర్ చేసి.. ఫ్యాన్స్ లోటు తీర్చాలని తారక్ భావిస్తున్నారట. త్వరలో తారక్ కొత్త ప్రాజెక్టులు ప్రకటించనున్నారని సమాచారం.

 

 

ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూ ఉంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌ఫుల్ హిట్ మూవీ తర్వాత తారక్-కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న చిత్రమిది. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ను అందించనున్నారు.

 

 

అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. జనవరిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -