TDP: కడప టీడీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేసిన చంద్రబాబు? ఆమెకు టికెట్ కన్ఫార్మ్?

వచ్చే ఎన్నికల కోసం పార్టీలన్నీ ఇప్పటినుంచే సన్నద్దమవుతున్నాయి. ఇప్పటినుంచే ఎన్నికల వ్యూహలను రచిస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికై ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నాయి టీడీపీ, వైసీపీ పార్టీలు. అభ్యర్థులను ఒక్కొక్కరిగా ఫిక్స్ చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను ఇప్పటినుంచే రంగంలోకి దింపుతున్నాయి. బలమైన అభ్యర్థి లేనిచోట బలమైన అబ్యర్థి కోసం పార్టీల అధినేతలు చూస్తున్నారు. ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేతలను పార్టీలన్నీ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రజల్లో ఆదరణ లేని నేతలను మోహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నాయి.

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఏకంగా కుప్పం నియోజకవర్గంపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆయనను ఓడించాలనే టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు. కుప్పం నేతలను ఇఫ్పటికే యాక్టివ్ చేసిన జగన్.. ఇటీవల వైఎస్సార్ చేయూత మూడో విడత నిధులను విడుదల చేసేందుకు ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందని వైసీపీ మంత్రులు కూడా కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువ పర్యటిస్తున్నారు. కుప్పంలో పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందినట్లుగానే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలనే వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారు.

జగన్ తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి పెట్టడంతో చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. జగన్ సొంత జిల్లా అయిన కడపపై చంద్రబాబు దృష్టి పెట్టారు. కడపలో మెజార్టీ సీట్లను గెలుచుకుని జగన్ కు సొంత జిల్లాలోనే చెక్ పెట్టే విధంగా చంద్రబాబు సైలెంట్ గా పని చేసుకుంటూ పోతున్నారు. కడప నియోజకవర్గాల్లోని నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో కడప అసెంబ్లీ స్థానంకు చంద్రబాబు ఇప్పటికే అబ్యర్థి ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. కడప అసెంబ్లీ స్థానంలో వైసీపీ మైనార్టీలకే టికెట్ కేటాయిస్తూ వస్తుంది.

గత ఎన్నికల్లో కడప నుంచి గెలిచిన అంజద్ బాషకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్ కేటాయించే అవకాశముంది. దీంతో నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీలకు వైసీపీ పెద్దపీట వేస్తుండటంతో మిగతా సామాజికవర్గాల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో మిగతా సామాజికవర్గాల్లో ఉన్న అసంతృప్తి, జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతరికేత తమకు కలిసొస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే కడప అసెంబ్లీ అభ్యర్ధిగా గొంగిరెడ్డి ఉమాదేవిని చంద్రబాబు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు కడప కార్పొరేషన్ లో టీడీపీ తరపున రెండుసార్లు ఆమె కార్పొరేటర్ గా విజయం సాధించారంటే ఆమెకు ఉన్న బలమెంటో అర్ధం చేసుకోవచ్చు. కడప కార్పొరేషన్ పరిధిలోని అలంఖాన్ పల్లె ఆమె సొంత గ్రామం. గొంగిరెడ్డి ఉమాదేవి మామ లక్ష్మిరెడ్డి జెడ్పీ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు. లక్ష్మిరెడ్డికి కడప నియోజకవర్గంలో అనుచరగణం ఉంది. ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మిరెడ్డికి కడప అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ వస్తుందని అందరూ భావించారు, కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. ఈ సారి ఆయన కుటుంబం నుంచి ఉమాదేవికి టికెట్ కన్ఫా్ చేసినట్లు తెలుస్తోంది.

కడప నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే హిందూ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి కందుల విశానందరెడ్డి గతంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మరే హిందూవు గెలవలేదు. మరి ఈ సారి అయినా గొంగిరెడ్డి ఉమాదేవి గెలుస్తరా లేదా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -