Janasena: జనసేన నేత మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్న టీడీపీ.. ఏమైందంటే?

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎల్లప్పుడూ వెంటనే ఉంటూ నీడలా ఉంటూ పార్టీకి చెందిన కార్యకలాపాలను చక్క దిద్దుతూ ఉంటారునాదెండ్ల మనోహర్.. కానీ తాజాగా అతనికి టిడిపి ఊహించని విధంగా ఒక వ్యక్తి షాక్ ను ఇచ్చింది. అయితే ఉమ్మ‌డి గుంటూరు జిల్లా తెనాలి నుంచి తాను పోటీలో వుంటాన‌ని రెండు రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ప్ర‌క‌టించారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని మోడ‌ల్‌గా తీర్చిదిద్ద‌డం త‌న ఆశ‌యం అని తెలిపారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా నాదెండ్ల‌కు టికెట్ కేటాయిస్తార‌ని అంతా అనుకున్నారు.

అయితే నాదెండ్ల ఆశ‌ల‌కు గండికొడుతూ తెనాలి టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ షాకింగ్ విష‌యాలు చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాను తెనాలి నుంచే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. తెనాలిలో జ‌న‌సేన‌కు టికెట్ కేటాయిస్తార‌నే విష‌యాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ఖండించారు. తెనాలిలో తాను పోటీ చేయ‌న‌ని సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు, అవినీతికి పాల్ప‌డుతున్న ప్ర‌తి ఒక్క‌రి గుండెల్లో నిద్ర‌పోతా, ఖ‌బ‌డ్దార్ అని కూడా ఆయ‌న హెచ్చ‌రించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఆల‌పాటి ప్ర‌క‌ట‌నతో నాదెండ్ల మ‌నోహ‌ర్ భ‌విష్య‌త్ ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆయ‌న తెనాలిలో పోటీ చేస్తాన‌ని ధీమాగా ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు.

 

జ‌న‌సేన‌లో నాదెండ్ల నంబ‌ర్ టూ లీడ‌ర్‌. అలాంటి నాదెండ్ల సీటుకే గ్యారెంటీ లేక‌పోతే, ఇక జ‌న‌సేన‌ను టీడీపీ ఏ విధంగా చూస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. పొత్తులో భాగంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు త‌దిత‌ర ముఖ్య‌మైన ప‌ది మంది నాయ‌కుల సీట్ల‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని జ‌న‌సేన నేత‌లు అనుకున్నారు. కానీ వాస్త‌వానికి వ‌స్తే, ప‌రిస్థితులు అంత సులువుగా లేవ‌ని జ‌న‌సేన నాయ‌కుల‌కు త‌త్వం బోధ‌ప‌డేలా ఆల‌పాటి రాజా చెప్ప‌క‌నే చెప్పారు. గతంలో న్యూస్ బయట చెప్పిన విధంగా నాదెండ్ల మనోహర్ కు తెనాలి నుంచి టికెట్ దక్కదు అన్నట్టుగానే అయ్యింది. కొద్దిరోజుల క్రితం న్యూస్ బైట్ ఇదే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అది నిజమైంది.

 

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -