TDP-Janasena: ఫ్లెక్సీలు చూసినా వైసీపీకి వణుకేనా.. టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు కనిపిస్తే ఇంత భయమా?

TDP-Janasena:  వైసిపి నేతలలోనూ కార్యకర్తలలోనూ ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో విజయం వారిదేనన్న ధీమాతో జనసేన టిడిపి నాయకులు ఉన్నారు కానీ తాము గెలుస్తాము అన్న ఆలోచన కూడా వైసిపి నాయకులలో లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా ఓటమి భయంతో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు ఏంటి అనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయారని చెప్పాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్ లను తెలుగుదేశం నాయకుల కటౌట్లను చూస్తుంటే కూడా వైసిపి నాయకులు భయంతో వణికిపోతున్నారు. దీంతో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు కనిపించకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి కటౌట్లు బ్యానర్లు కనిపించిన వెంటనే అధికారులు వాటిని తొలగిస్తున్నారు.

ముఖ్యంగా కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నేతల బ్యానర్లు కడితే చాలు వెంటనే వాటిని చింపడమే కాకుండా పెద్ద ఎత్తున అల్లర్లకు గొడవలకు కారణం అయ్యేలా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా జనసేన టిడిపి ఫ్లెక్సీలను చింపడంతోనే వైసిపి నేతలలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది. అధికారులు కూడా వైసిపి పార్టీ బ్యానర్లు ఉంచి తెలుగుదేశం పార్టీ బ్యానర్లను తొలగించడంతో పార్టీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -