TDP-Janasena-BJP Manifesto: కూటమి మేనిఫెస్టో చూసి జగన్ ఓటమి ఫిక్స్ అయ్యారా.. ఏం చేసినా పార్టీ గెలిచే ఛాన్స్ లేదా?

TDP-Janasena-BJP Manifesto: మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున హడావిడి నెలకొంది. ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోని కూడా ఇరువురు పార్టీలు విడుదల చేశారు. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. అయితే ఈయన నవరత్నాలు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కొంత మొత్తంలో నగదును చేర్చి ప్రకటించారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో చూసి అందరూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. జగన్ చెప్పబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ మెగా డీఎస్సీ వంటి అంశాలు ఉంటాయని అందరూ భావించారు కానీ అలాంటివి లేకపోవడమే కాకుండా గత పథకాలని ప్రవేశపెట్టడంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా కూటమికి మేనిఫెస్టో కూడా విడుదలైంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇందులో భాగంగా సరికొత్త అంశాలు అలాగే పథకాలను చేర్చడంతో ప్రజల నుంచి పూర్తి మద్దతు కూటమికే ఉందని చెప్పాలి. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రైతులకు 20,000 భరోసా అమ్మబడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ప్రకటించారు అలాగే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటూ సూపర్ సిక్స్ పథకాలను బాబు ప్రకటించారు.

ఈ విధంగా రెండు పార్టీ నేతలు మేనిఫెస్టోని ప్రకటించడంతో రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూస్తూ ప్రజలు తమ ఓటు ఎవరికి వేయాలి అనేది అప్పుడే ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో విడుదల తరువాతనే జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా ఫిక్స్ అయిందని, ఏం చేసినా కూడా కూటమి గెలుపును ఆపటం ఎవరి తరం కాదని మేనిఫెస్టోలో చెబుతున్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -