Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా టీడీపీ బ్లేమ్ గేమ్

Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ మళ్లీ దాడి మొదలుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ గా కొత్త బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ను బద్నాం చేసి ప్రజల్లో అతడి పట్ల వ్యతిరేకత తీసుకురాడమే లక్ష్యంగా టీడీపీ ప్రవర్తిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్లేమ్ చేసే ప్రయత్నాలను మరింత షురూ చేసింది. ఎన్టీఆర్ వైసీపీకి అనుకూలమనేలా ఫోకస్ చేసి అతడిని టీడీపీ శ్రేణులకు దూరం చేసే విధంగా టీడీపీ కసరత్తులు చేస్తోంది. టీడీపీకి అతడు ప్రత్యర్ధి అనే విధంగా చంద్రబాబు అండ్ కో ప్రచారం చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోన్నాయి. విజయవాడ సిటీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ పేరును మార్చడం సరికాదని వ్యాఖ్యానించం వైసీపీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది. ఇట టీడీపీ కార్యకర్తలు, నేతుల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.

అయితే జగన్ ప్రభుత్వం నిర్ణయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్, వైఎస్సార్ లు ఇద్దరు ప్రజాదరణ కలిగిన నాయకులని ఎన్టీఆర్ వ్యాఖ్యానించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ ను పొగడటం పట్ల జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో యాంటీగా పోస్టులు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కాదని జూనియర్ వైఎస్సార్ అని కొందరు, జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ, నాగపూర్ మధ్య ఉగిసలాడుతున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ మరికొందరు మాత్రం చనిపోయిన వైఎస్సార్ ను గౌరవిస్తూ అలా పిలిస్తే అందులో తప్పేంటని మరికొంందరు ప్రశ్నిస్త్నారు. వైఎస్సార్ ను పొగుడుతూ గొడమీద పిల్లిలా ఎన్టీఆర్ వ్యవహరించాలని టీడీపీ శ్రేణుులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ దీటుగా వైసీపీ ప్రభుత్వానికి రియక్షన్ ఇవ్వాలేకపోయారని, సాఫ్ట్ కార్నర్ గానే ఎన్టీఆర్ ట్వీట్ ఉందని అంటున్నారు. తాతకు తగ్గ మనువడిలా ఎన్టీఆర్ స్పందించలేదని, తూతూమంత్రంగానే స్పందించాలని అంటున్నారు. పాము చావొద్దు.. కర్ర విరగొద్దు అనే చందంగా ఎన్టీఆర్ స్పందన ఉందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

గతంలో కూడా హరికృష్ణ బ్రతికున్న సమయంలో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసింది చంద్రబాబు అండ్ కో. హరికృష్న వైసీపీలో చేరతారని, ఎన్టీఆర్ వైసీపీకి ప్రచారం చేస్తారనేర ఫుకార్లను సోషల్ మీడియాలో వదిలింది. ఇక మొన్న అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ తర్వాత మాత్రం ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్లరని, తాత పెట్టిన పార్టీని వదిలి ఎక్కడికి పోరని టీడీపీ నేతుల వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ రివర్స్ అయింది. తాత విషయంలో వైసీపీ పట్ల ఇంకా సాప్ట్ కార్నర్ ధోరణీని ఎన్టీఆర్ అవలంభించం సరికాదని టీడీపీ శ్రేణులు అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడితే సినిమాల విషయంలో ఇబ్బందులు వస్తాయని, వైసీపీలోని ఫ్యాన్స్ దూరమవుతారని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తే అది తన తాతను మోసం చేసినట్లు అవుతుందని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీలోని ఇంకా చాలామంది కుటుంబసభ్యులు ఇప్పటివరకు స్పందించలేదు. నందమూరి కల్యాణ్ రామ్ కూడా గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ వారి పట్ల సానుకూలంగా ఉన్న టీడీపీ.. ఎన్టీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రజల్లో బ్లేమ్ చేసేలా ప్రవర్తిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leader: మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత.. ఈ నాయకుడు చేసిన పనికి షాకవ్వాల్సిందే!

YSRCP Leader: ఇంటి పక్కన కాలి స్థలం విషయంలో ఓ వైసిపి నాయకుడు మహిళతో గొడవకు దిగి ఏకంగా ఆమెను మంటలలోకి తోసేసిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. ఇలా మంటలలో పడినటువంటి ఆమె...
- Advertisement -
- Advertisement -