Munugode By-Election: మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ.. నేతలతో చంద్రబాబు కీలక సమావేశం

Munugode By-Election: ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక  తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. పార్టీ మధ్య మాటల యుద్దం, ఫిర్యాదులతో మునుగోడు బై పోల్ హీటెక్కింది. ఎన్నికలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. ప్రచారపర్వంలో మునిగిపోయాయి. ఆరోపణలతో మునుగోడు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసుకుంటోంది. తెలంగాణలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి, టీజేఎస్, బీఎస్పీ పార్టలు కూడా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి.

ఈ క్రమంలో తెలంగాణలో కీలక ఓటు బ్యాంకు కలిగి ఉన్న టీడీపీ కూడా మునుగోడులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మునుగోడులో టీడీపీకి కాస్త బలం ఉంది. క్యాడర్ కూడా బాగానే ఉంది. దీంతో టీడీపీ కూడా పోటీలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మునుగోడులో పోటీపై కీలక ప్రకటన చేశారు. మునుగోడులో పోటీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ నేతలకు సూచించారు. పొత్తులలో భాగంగా మునుగోడులో మూడుసార్లు బీసీలకు ఇచ్చామని, చాలా తక్కువ ఓట్లతో బీసీలు ఓడిపోయారని చంద్రబాబు తెలిపారు.

బీసీలను పార్టీలు పట్టించుకోవడం లేదని, తెలంగాణలో టీడీపీ బలపడితేనే బీసీలకు మంచి భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలపడే విధంగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గళం విప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, పరిణామాలకు నేతలతో చంద్రబాబు చర్చించారు. పార్టీ బలోపేతం కోసం సంస్థాగతంగా, పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి నేతలకు వివరించారు. రాష్ట్రంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని నేతలు సూచించారు. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడిపోవడంతో బడుగు, బలహీన వర్గాలు కూడా బలహీనపడ్డాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే మునుగోడులో బీసీ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని, బీసీల పార్టీగా టీడీపీకి పేరు ఉందన్నారు. టీడీపీ పోటీ చేస్తే బలపడే అవకాశముందని చంద్రబాబుకు నేతలు సూచించారు. గత కొంతకాలంగా మునుగోడులో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు బాబుకు వివరించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, కంభంపాటి రాంహోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, భువనగిరి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణమాచారి, మునుగోడు నియోజకవర్గ టీడీపీ నేతలు బడుగు లక్ష్యయ్య, అక్కెన అప్పారావు, వయిజ్, హన్నుభాయ్ లు చంద్రబాబు కలిసి మునుగోడులోని రాజకీయ పరిస్థిుతుల, టీడీపీ పోటీపై చర్చించారు. మునుగోడులో పోటీకి టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతలు చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -