Jharkhand: తరగతి గదిలో దుస్తులు విప్పించారని విద్యార్థిని ఆత్మహత్య!

Jharkhand: కొందరి ఉపాధ్యాయుల కఠిన ప్రవర్తన విద్యార్థులను ఇబ్బదులకు గురి చేస్తోంది. కొన్ని సార్లు ఉపాధ్యాయుల తీరుతో క్షాణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి విలువైన ప్రాణాలు తీసుకుని వారి కుటుంబాలను శోకసంద్రంలో నెట్టేస్తున్నారు. క్లాస్‌రూమ్‌లో అల్లరిచేశారని.. అమ్మాయితో మాట్లాడాడని దుర్భాషలాడం, చితకబాదడం తో కొందరు విద్యార్థులు మనస్తాపానికి పాల్పడి అఘాయిత్యాలకు యత్నించారు. తాజాగా ఓ ఉపాధ్యాయురాలి తీరుతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పరీక్షలో బాలిక కాపీ కొడుతుందని భావించిన టీచర్‌ ఆమె దుస్తులు విప్పించింది. దీంతో అవమానంగా భావించిన బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేసింది. అందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఝార్ఖండ్‌లో జంషెడ్‌పూర్‌ పరిధిలో ఓ బాలికల పాఠశాలలో గత కొన్ని రోజులుగా పరీక్షలు కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగా శుక్రవారం పరీక్ష నడుస్తోంది. ఈ సందర్భంగా తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని చూసి రాస్తుందని అనుమానం వ్యక్తిం చేస్తూ చిట్టీలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆమె దుస్తుల్ని విప్పించి, తనిఖీ చేసింది. క్లాస్‌ రూమ్‌లో తోటి విద్యార్థుల ముందు తన దుస్తులు విప్పించడంతో సదరు విద్యార్థిని అవమానంగా భావించి మనస్తాపానికి గురైంది. పరీక్ష పూర్తయ్యాక ఇంటికి వెళ్లింది. ఏడ్చూకుంటూ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి ఓ గదిలోకెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో గుర్తించిన కుటుంబీకులు మంటలార్పి హుటాహుటిన సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 80 శాతం శరీరం కాలిపోవడంతో విద్యార్థిని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విద్యార్థుల పట్ల మరీ అంతగా కఠినంగా ప్రవర్తించడం సరికాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -