Saudi League: టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడేది లేదు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Saudi League: టీమిండియా క్రికెటర్లు వేరే దేశాల క్రికెట్ టోర్నీలలో ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తుండగా.. ఐపీఎల్ తరహాలో చాలా దేశాలు పొట్టి ఫార్మట్‌ క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఐపీఎల్ తరహాలో భారీ క్రికెట్ టోర్నీని ప్రారంభించాలని చూస్తోంది. అందులో భాగంగా భారీ ఆఫర్‌ను ప్రకటించగా.. బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది.

అయితే ప్రస్తుతానికి టీమిండియాకు ఆడుతన్న క్రికెటర్లు విదేవీ లీగులలో ఆడటానికి వీలు లేదని, రిటైర్మెంట్ తర్వాత పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది. గతంలో కూడా ఇవే నిబంధనలు ఉండగా.. ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తూ కీలక ప్రకటన జారీ చేసింది. విదేశీ లీగుల్లో తమ క్రికెటర్లు ఆడటానికి వీలు పడదని, కావాలంటే ప్రాంచైజీలు తమ జట్టును బరిలోకి దింపవచ్చని తెలిపింది. ప్రాంచైజీలకు వ్యక్తిగత స్వేచ్చ ఉంటుందని, అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

 

ఇప్పటికే ఐపీఎల ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా, దుబాయ్ లీగ్ లలో జట్లను సొంతం చేసుకున్నాయని, ప్రపంచంలో జరిగే ఏ లీగులోనైనా తమ జట్టు ఆడాలని కోరుకోవడంతో ప్రాంచైజీల తప్పు లేదని తెలిపింది. అయితే ఐపీఎల్ లాంటి అత్యంత పాపులర్, ధనిక లీగ్ ను సౌదీ అరేబియా ప్రారంభించాలనుకుంటే టీమిండియా టాప్ క్రికెటర్లు పాల్గొంటేనే అది సాధ్యమవుతుంది. దీంతో టీమిండియా క్రికెటర్లను కూడా విదేశీ లీగుల్లో పాల్గొనడానికి అనుమతించాలని బీసీసీఐను సౌదీ అరేబియా ప్రభుత్వం కోరింది. కానీ సౌదీ అరేబియా ప్రభుత్వ ప్రతిపాదనను బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. తమ విధానం ఇప్పుడు మార్చుకోలేమని, తమ క్రికెటర్లను విదేశీ లీగులలో ఆడటానికి అనుమతించేది లేదని తెలిపింది. తమ క్రికెటర్లు ఎక్కడా ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సౌదీ అరేబియా ప్రభుత్వానికి తమ అబిప్రాయాన్ని లిఖితపూర్వకంగా పంపించింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -