Team India: ప్రపంచకప్ పోయినా బుద్దిరాలేదా..? అదే తప్పు మళ్లీ చేస్తున్న టీమిండియా

Team India: ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడి మరోసారి ఐసీసీ ట్రోఫీలో ఉత్తచేతులతోనే తిరిగొచ్చింది. ఈ ప్రపంచకప్ లో భారత వైఫల్యంపై తప్పంతా సెలక్టర్లదే అని చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని ఉన్నఫళంగా రద్దు చేసింది. నలుగురు సభ్యులను వారి పదవుల నుంచి తొలగించి కొత్త సెలక్షన్ కమిటీకి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో పాటు వయసు, ఫామ్ దృష్ట్యా రోహిత్ ను కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నది.

 

అయితే ప్రపంచకప్ లో దారుణ వైఫల్యం ఎదురైనా అక్కడ చేసిన తప్పులనే టీమిండియా రిపీట్ చేస్తున్నది. సీనియర్లు అశ్విన్, కార్తీక్, రోహిత్, రాహుల్ లు ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యారు. టీ20 ప్రపంచకప్ లో వీరి ఆట చూశాక అసలు యువ జట్టును పంపితే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపించాయి. పలువురు యువ ఆటగాళ్లను ఎంపిక చేసినా వారికి తుది జట్టులో చోటు దక్కలేదు.

 

కాగా ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ కూడా ఇదే తప్పులను రిపీట్ చేస్తున్నది. కివీస్ తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో భారత్ యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తుందని అంతా భావించారు. ఐపీఎల్ తో పాటు దేశవాళీలో రాణించిన ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ లకు జట్టులో చోటు దక్కుతుందని అంతా ఆశించారు. కానీ టీమిండియా యాజమాన్యం మాత్రం అలా చేయలేదు. వికెట్ కీపర్ గా రిషభ్ పంత్, సీనియర్ పేసర్ భువనేశ్వర్ లకు ఛాన్స్ ఇచ్చింది.

 

2024 టీ20 ప్రపంచకప్ కు జట్టును తయారుచేయాలని భావిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ సీనియర్లకే అవకాశమివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. అనుభవం లేని ఉమ్రాన్ మాలిక్ తో పాటు సంజూ శాంసన్ లకు అవకాశాలిచ్చి మరో రెండేండ్లలో మెరుగైన జట్టును తయారు చేయాలని టీమిండియా ఫ్యాన్స్ సూచిస్తున్నారు. భువీ మంచి బౌలరే అయినా 2024 వరకు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. ఇక పంత్ కు వరుసగా అవకాశాలిస్తున్నా అతడు టీ20లలో స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. దీంతో సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -