Team India: నెక్స్ట్ కెప్టెన్ అతడే.. ఈ వైఫల్యాల తర్వాత టీమిండియాలో రిటైర్మెంట్లు తప్పవు..

Team India: టీ20 ప్రపంచకప్ లో ఓటమి టీమిండియాను దారుణంగా కుంగదీసింది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో ఐదింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ టాపర్ గా సెమీస్‌కు చేరిన టీమిండియా.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఈ నేపథ్యంలో జట్టులో పలువురు సీనియర్లు ఇకనైనా రిటైర్మెంట్ ప్రకటించాలని వాదనలు మొదలయ్యాయి. రోహిత్ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లు ఆటకు గుడ్ బై చెప్పి యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వెళ్లువెత్తుతున్నాయి.

 

ఇదే విషయమై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడాక టీమిండియాలో కొన్ని రిటైర్మెంట్ ప్రకటనలు ఉండొచ్చని సన్నీ అన్నాడు. అలాగే హార్ధిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని సూచించాడు.

 

గురువారం మ్యాచ్ ముగిసిన తర్వాత సన్నీ మాట్లాడుతూ.. ‘హార్ధిక్ పాండ్యా సారథిగా తన తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ టైటిల్ నెగ్గాడు. అతడు కచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడు. నాకు తెలిసి ఈ ఓటమి తర్వాత జట్టులో కొన్ని రిటైర్మెంట్ ప్రకటనలు కూడా ఉండొచ్చు. ఇదే విషయమై పలువురు ఆటగాళ్లు ఆలోచిస్తున్నారు. జట్టులో కొంతమంది 30 ప్లస్ దాటినవాళ్లు ఉన్నారు. వాళ్లు టీ20 జట్టు నుంచి తప్పుకోవచ్చు..’ అని తెలిపాడు.

 

గవాస్కర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమిండియా సారథి రోహిత్ శర్మ, మాఈ సారథి విరాట్ కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ లు త్వరలోనే ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తున్నది. వీళ్లంతా 34 ఏండ్లకు పైబడినవారే కావడం గమనార్హం. బీసీసీఐ కూడా రోహిత్ – కోహ్లీలు టీ20 క్రికెట్ ఆడాలా..? లేదా..? అనేదానిపై నిర్ణయం వాళ్లిద్దరికే వదిలేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -