Team india: మా చేతుల్లో ఏదీ లేదు.. భారత్‌లో పాక్ పర్యటనపై పీసీబీ చైర్మన్ సేథీ

Team india: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ ఉన్న ఆటల్లో ఫుట్ బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ఆట తర్వాత అంతటి క్రేజ్ ఉన్న గేమ్ గా క్రికెట్ ను చెప్పొచ్చు. పాపులారిటీతోపాటు ధనార్జనలోనూ ఈ గేమ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి అగ్రశ్రేణి జట్లు ఆడే సిరీస్ లు చూసేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక దాయాది పాకిస్థాన్ తో టీమిండియా తలపడే మ్యాచులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇరు జట్ల ప్లేయర్లు భీకరంగా తలపడతారు కాబట్టే మ్యాచులు కూడా ఉత్కంఠను రేపుతూ సాగుతాయి.

 

భారత్–పాక్ మ్యాచ్ కోసం అందరూ కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటారు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. దాయాది దేశం ఉగ్రవాదులను మన దేశంపై ఉసిగొల్పడం, బార్డర్ వద్ద కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో ఆ పాక్ తో సన్నిహిత సంబంధాలకు భారత ప్రభుత్వం చెక్ పెట్టింది. క్రికెట్ మ్యాచులను కూడా ఆ దేశంతో ఆడొద్దని నిర్ణయించింది. దీంతో ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు.

 

టీమిండియాతో పాక్ సిరీస్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో సేథీ ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని ఆయన తెలిపారు.

 

క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాం: నజామ్ సేథీ
‘పాకిస్థాన్, భారత్ ల మధ్య క్రికెట్ సంబంధాలు ఆందోళనకరంగా ఉన్నాయి. అందుకే స్పందించాల్సి వస్తోంది. పాక్ జట్టు అక్కడం ఆడటం, పర్యటనకు వెళ్లడం లాంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ డెసిజన్ తీసుకోవాల్సింది పీసీబీ కాదు. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. పీసీబీ క్లారిటీ కోసం ఎదురు చూస్తోంది. అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తోనూ సంప్రదింపులు జరుపుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటాం’ అని సేథీ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -