Team India: ప్రపంచ రికార్డును నెలకొల్పిన టీమిండియా.. దీన్ని అధిగమించడం కుదరదంతే!

Team India: ప్రపంచ క్రికెట్ లో బ్యాటింగ్ లో హవా చూపించే జట్టుగా టీమిండియాకు పేరుంది. అలాగని మన బౌలర్లను తీసిపారేసినట్లు కాదు. కానీ భారత జట్టు బలం, బలగం ఎప్పుడూ బ్యాటింగ్ అనేది కాదనలేని నిజం. బ్యాటింగ్ లో మనం మెరుపులు మెరిపించినప్పుడు జట్టు ఎక్కువసార్లు విజయం సాధిస్తుంది. అదే విఫలమైతే మాత్రం బౌలింగ్ వల్ల కొన్నిసార్లు గెలిచాం. అయినా క్రికెట్ బ్యాటింగ్ డామినేషన్ గేమ్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి బ్యాటింగ్ ను దృఢంగా ఉంచుకోవడంలో తప్పు లేదు.

 

బ్యాటింగ్ డామినేషన్ ఉన్న టీమ్స్ లో టీమిండియా టాప్ ప్లేసులో ఉంటుంది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో భారత జట్టు నుంచి నిఖార్సయిన బ్యాటర్లు ఎంతోమంది పుట్టుకొచ్చారు. దానికి రికార్డులే తార్కణంగా నిలుస్తున్నాయి. టెస్టులు, టీ20లను అటుంచితే.. వన్డే క్రికెట్ లో టీమిండియా బ్యాటర్ల విధ్వంసం ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకు తాజా రికార్డే ఉదాహరణ. ఇప్పటివరకు అందరు భారత ఆటగాళ్లు కలసి వన్డేల్లో 300 సెంచరీలు నమోదు చేశారు.

విరాట్ సెంచరీతో అరుదైన రికార్డు

బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన మూడో వన్డేలో.. విరాట్ కోహ్లీ (113) శతకంతో.. సెంచరీల్లో 300 మార్కును టీమిండియా చేరుకుంది. ఇదో కొత్త ప్రపంచ రికార్డు. ఈ జాబితాలో దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. మాజీ సారథి విరాట్ కోహ్లీ (39), రోహిత్ శర్మ (34), సౌరవ్ గంగూలీ (23), శిఖర్ ధావన్ (10) శతకాలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇషాన్ డబుల్ తో.. బంగ్లా ట్రబుల్

ఇకపోతే, బంగ్లాదేశ్ తో ముక్కోణపు సిరీస్ లో ఓడినప్పటికీ.. ఆఖరి వన్డేలో మాత్రం టీమిండియా ఇరగదీసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే కోహ్లీ కూడా సెంచరీతో టీమిండియా ఈ మ్యాచ్ ను సులువుగా గెలిచింది. ఇక, త్వరలో జరిగే టెస్టు సిరీస్ లో బంగ్లా పులులను చితగ్గొట్టి.. వన్డే సిరీస్ ఓటమికి పగతీర్చుకోవాలని భారత జట్టు చూస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -