Team India: శార్దూల్ ఠాకూర్ ట్వీటర్ లైక్స్ పై చెలరేగిన దుమారం

Team India: టీమిండియా ఎంపికలో బీసీసీఐ సెక్రటరీ జై షా జోక్యం చేసుకున్నాడని తెలుస్తోంది. గుజరాత్ ఆటగాళ్లకు ఆయన అనవసర ప్రాధాన్యత ఇస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. క్రికెట్ దిగ్గజాలు, విశ్లేషకులు జై షా తీరుపై పెదవి విరుస్తున్నారు. బంగ్లాదేశ్‌తో ఆదివారం రెండో టెస్ట్‌ జరిగింది. ఇందులో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి జయదేవ్ ఉనాద్కత్‌ను తీసుకోవడంతో అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు.

 

ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకున్నప్పుడు రెగ్యులర్ పేస్ ఆల్‌ రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ ఆడించకుండా గుజరాత్ ప్లేయర్ అయిన జయదేవ్ ఉనాద్కత్‌ను ఎందుకు ఆడించారని విమర్శకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జై షా ఆదేశాలతోనే ఈ మార్పు చేశారని అందరికీ తెలియడంతో దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

 

శార్దూల్ ఠాకూర్‌కు మద్దతుగా టీమిండియాలో రాజకీయాలు జరిగాయని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. శార్దూల్‌ జట్టులో ఉండాల్సిందని, గుజరాత్ రాజకీయాలకు బలి చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలవమైన ప్రదర్శన చేయడంతో శార్డూల్ రంజీ ట్రోఫీలు ఆడుకోవడం మంచిదన సలహాలు ఇస్తున్నారు. ఇటువంటి ట్వీట్లకు శార్దూల్ ఠాకూర్ లైక్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.

 

కుల్దీప్‌ యాదవ్‌ను కాదని జయదేవ్‌ ఉనద్కత్‌ను ఎంపిక చేయడం గురించి చర్చ జరుగుతోంది. అయితే శార్దూల్‌ విషయం సోషల్‌ మీడియాకి తెలియడంతో ఇప్పుడు టీమిండియాలో ఏం జరుగుతోంది అంటూ చర్చలు ఊపందుకున్నాయి. 2018లో అరంగేట్రం చేసిన శార్దూల్‌ కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడి 27 వికెట్లు మాత్రమే పడగొట్టడం విశేషం. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ వంటి బౌలర్ల రావడంతో అతను కూడా టీమిండియాలోకి వచ్చాడు. తుది జట్టులోకి శార్దూల్‌ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -