ODI Record: వన్డే చరిత్రలోనే టీమిండియా భారీ గెలుపు

ODI Record: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం నాడు త్రివేండ్రం వేదికగా జరిగిన మూడో వన్డేలో గెలిచి అభిమానులకు సంక్రాంతి కానుకను అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించడం విశేషం. ఈ విజయంతో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో ఏ జట్టు కూడా ఇంత భారీ తేడాతో గెలిచిన దాఖలాలు లేవు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) శతకం సాధించగా కెప్టెన్ రోహిత్ శర్మ(42) ఫర్వాలేదనిపించాడు. గిల్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ. రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలుత ఆచితూచి ఆడాడు. తర్వాత గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ముఖ్యంగా కోహ్లీ 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డుకు ఇంకా మూడు సెంచరీల దూరంలోనే ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ (38) కోహ్లీకి సహకారం అందించాడు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ విఫలమయ్యారు. అయితే గిల్, కోహ్లీలు సెంచరీలతో విజృంభించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది.

73 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
391 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆది నుంచే ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. తొలి వన్డే మాదిరిగా కెప్టెన్ షనక కూడా నిలవలేకపోయాడు. ఫెర్నాండో(19), డసన్ షనక(11), కసున్ రజిత(13 నాటౌట్) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు సాధించగా షమీ, కుల్‌దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -