Technology: తక్కువ సమయంలో వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Technology: సాధారణంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు వాటి ఫీచర్స్, ధర, కెమెరా,బ్యాటరీ ఇలా అన్ని చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మంది చార్జింగ్ కూ బాగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. అలాగే తొందరగా చార్జింగ్ అయ్యే ఫోన్లకు ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగా ఏ మొబైల్ అయితే ఎక్కువ స్పీడ్ గా ఛార్జ్ అవుతుందో అటువంటి మొబైల్ ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఛార్జింగ్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌ కేవలం 8 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఫుల్‌ కానుంది.

 

ఇకపోతే ఫీచర్స్ ధర విషయానికి వస్తే.. రియల్‌మీ జీటీ నియో 5 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫంక్షన్‌లో 240 వాట్స్‌ ఛార్జింగ్ బ్యాటరినీ అందించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ఫోన్‌గా కూడా ఈ ఫోన్‌కు పేరుంది. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఫోన్ 15 వాట్స్‌ ఛార్జింగ్ స్పీడ్‌తో ఛార్జ్‌ అవుతుంది. రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అందిన సమాచారం ప్రకారం.. ఇందులో 6.7 ఇంచెస్‌ ఓ ఎల్ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

 

144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. 128 జీబీ స్టోరేజ్‌తో రానున్న ఈ ఫోన్‌ ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేయనున్నారు అన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ చాలామంది ఈ ఫోన్ ని కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తిని కనబడుతున్నారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే తొందరగా చార్జింగ్ ఎక్కడం ఈ ఫోన్ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -