Technology: అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Technology: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ నెమ్మదిగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లోనే మొబైల్ తయారీ కంపెనీలు ఫైవ్ జి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ మొబైల్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి ఒక కొత్త ఫోను తీసుకువస్తోంది. రూ.15 వేల లోపు వివో వై35 ఫోన్ అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఆ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. వివో సంస్థ మార్కెట్లోకి వివో వై35 పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

 

ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ అలాగే 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదల చేయనుంది. వివో వై35 4జీబీ వేరియంట్ ధర విషయానికి వస్తే ఇది రూ. 14,138 గా ఉంది. అలాగే 6 జీబీ వేరియంట్‌ ధర విషయానికి వస్తే ఇది రూ. 16,521 గా ఉంది. 8 జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర విషయానికి ఇది రూ. 17,672 గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ కానుంది అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే..

 

ఇందులో 6.5 ఇంచెస్‌ డిస్‌ప్లే, 60HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌, 269 PPI పిక్సెల్ డెన్సిటీ, 120HZ టచ్ శాంప్లింగ్ రేట్, 720×1600 పిక్సెల్‌ ల రిజల్యూషన్‌ను అందించనున్నారు. ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ఆరిజిన్‌ ఓఎస్‌ ఓషన్‌ యూఐతో ఈ ఫోన్‌ పనిచేయనుంది. స్టోరేజీ పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఇక కెమెరా విషయానికొస్తే 13 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -