Technology: వాట్సాప్ లో ఈ స్టేటస్ ట్రిక్ మీకు తెలుసా?

Technology: చాలామంది వారి మూడ్ ని బట్టి వాట్సాప్ లో స్టేటస్ లను అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వాట్సాప్ వినియోగించేవారు వారు మూడ్ ఎలా ఉంటే ఆ మూడు ని బట్టి స్టేటస్ లు అటువంటివే పెడుతూ ఉంటారు. అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత, లేదంటే ఇతరుల వాట్సాప్ మనం చూసేటప్పుడు మనం చూసినట్టు అవతలి వ్యక్తి తెలియకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే అందుకు ఏం చేయాలో తెలియక చాలామంది వారి వాట్సాప్ లని చూడకుండాస్కిప్ చేస్తూ ఉంటారు.

అయితే అవతలి వ్యక్తి ఒక వాట్సాప్ స్టేటస్ ను మనం చూసిన కూడా చూడనట్టుగా కనిపించడానికి కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి. మామూలుగా వాట్సాప్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఎవరెవరు చూశారు అన్నది మనకు హిస్టరీలో తెలిసిపోతూ ఉంటుంది. ఇలా మన పేరు అవతలి వ్యక్తికి కనిపించకుండా ఉండాలి అంటే వాట్సాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీలో రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ను డిసేబుల్ చేయాలి. లేదంటే ఫోన్ లోని ఫైల్స్ లో స్టేటస్ ఫోల్డర్ కి వెళ్లి చూడాలి.

అలాగే రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్ ని డిసేబుల్ చేయడం వల్ల ఇతరులకు మన మెసేజ్ చదివినా కూడా బ్లూ టిక్ కాకుండా డబల్ టిక్ మాత్రమే పడుతుంది. మరొక మార్గం ఏమిటంటే మొబైల్ డేటాను ఆఫ్ చేసి ఆ తర్వాత ఎవరి స్టేటస్ అయితే చూడాలి అనుకుంటున్నామో వారి స్టేటస్ ను చూడవచ్చు. అయితే మళ్లీ ఆన్ లైన్ లోకి వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తి చూసినట్టు స్టేటస్ పెట్టిన వారికి తెలుస్తుంది. కనుక స్టేటస్ ఎక్స్ పైరీ అవ్వడానికి ముందు మొబైల్ లో డేటా ఆఫ్ చేసి చూడడం ఒక మార్గం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -