Technology: ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి నయా ఫీచర్లు!

Technology: ఒకప్పుడు ఫేస్ బుక్ వాడకం విపరీతంగా ఉండేది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు చాలామంది ఫేస్ బుక్ లో గంటలకొద్ది గడిపేవారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి మొబైల్స్ లో ఫేస్ బుక్ తప్పనిసరిగా ఉండేది. పొద్దున్నే లేవగానే ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఫీడ్, మెస్సేజ్ లు చూసుకునేవారు చాలామంది ఉండేవారు. ఇక రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫేస్ బుక్ లో గడిపేవారు. ప్రస్తుతం కూడా ఫేస్ బుక్ చాలామంది ఉపయోగిస్తుండగా.. గతంలో పోలిస్తే ఉపయోగించేవారి సంఖ్య చాలా తగ్గింది.

కొత్త కొత్త యాప్ లు రావడంతో ఫేస్ బుక్ ను వదిలేసి వాటివైపు మొగ్గు చూపుతున్నారు. వాట్సప్ లాంటివి రావడంతో ఫేస్ బుక్ కు యూజర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఇక ఇన్ స్టాగ్రామ్ ఎప్పటినుంచో ఉన్నా.. గతంలో చాలా తక్కువమంది దీనిని ఉపయోగించేవారు . ఫేస్ బుక్ తరహాలోనే ఫొటోలు, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ కోసం ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగించేవారు. కానీ రీల్స్ ఫీచర్ ప్రవేశపెట్టిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ కు యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో ఇన్ స్టాగ్రామ్ కు యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది రీల్స్ చేస్తూ బిజినెస్ ప్రమోషన్స్ ద్వారా బోల్డెంత ఆదాయం సంపాదిస్తుంటే… మరికొంతమంది రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయి ఆ తర్వాత సెలబ్రెటీలు అయినవారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పేరు తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన వారు కూడా ఉన్నారు. అయితే రీల్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఇన్ స్టాగ్రామ్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటోంది. తాజాగా మరో మూడు కొత్త ఫీచర్లను ఇన్ స్టా అందుబాటులోకి తెచ్చింది. ఇన్ స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ మొస్సెరీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

రీల్స్ కు రీచ్ పెంచుకునేందుకు ఫేస్ బుక్ లో క్రాస్ పోస్టింగ్ చేసే ఫీచర్ ను ఇన్ స్టా తీసుకొచ్చింది. దీని వల్ల ఇన్ స్టాలో పోస్ట్ చేసిన రీల్స్ ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ అవుతాయి. దీని కోసం మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటివరకు యాడ్ యువర్స్ అనే స్టిక్కర్ ఇన్ స్టా స్టోరీకలు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని ఇన్ స్టా రీల్స్ కు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే రీల్స్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసుకునేలా ఇన్ సైట్స్ సదుపాయం కొత్తగా తీసుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -