OLA S1 Electric Scooter: ‘బడ్జెట్’లోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఖరీదు తెలిస్తే షాక్?

OLA S1 Electric Scooter: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లను విడుదల చేయగా తాజాగా ఒకసారి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఓలా ఎస్ 1 పేరుతో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది ఓలా సంస్థ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999 గా నిర్ణయించింది. అయితే గతేడాది లాంచ్ అయిన ఓలా ఎస్1 ప్రో టెక్నాలజీ తోనే దీనిని కూడా రూపొందించారు. కాగా ఈ సరికొత్త స్కూటీ 131 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందట.

అంతేకాకుండా గంటకు 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకుపోతుందట. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగష్టు 15 కి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓలా సంస్థ ఈ ఓలా ఎస్1 ప్రో మోడల్‌ని విడుదల చేసింది. అయితే ప్రస్తుత ప్రారంభ ఆఫర్ కింద ప్దీని ధరను రూ.99,999గా నిర్ణయించడం జరిగింది. అయితే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వినియోగదారులు కేవలం రూ.499 చెల్లించి ఈ స్కూటీని బుక్ చేసుకోవచ్చట. కాగా వచ్చే నెల అనగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఈ స్కూటర్ రెడ్, జెట్ బ్లాక్, పోర్స్‌లెయిన్ వైట్, నియో మింట్, లిక్విడ్ సిల్వర్ కలర్ లలో లభిస్తోంది. కాగా ఈ స్కూటర్ కూడా ఆపరేటింగ్ సిస్టంను కూడా అందించారు. మూవ్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టం పై స్కూటీ పై ఫోన్ పనిచేయనుంది. 7 అంగుళాల టచ్ స్క్రీమ్, 8కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.అయితే ఓలా ఎస్1 ప్రో తరహాలో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంది. సపోర్ట్ చేసే యాప్ ద్వారా చార్జ్ స్టేటస్, ఓడో మీటర్ రీడింగ్ వంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చట. కాగా ఈ ఏడాది దీపావళి నాటికి మూవ్ఓఎస్ 3.0 అప్‌డేట్‌ను కూడా అందిస్తామని ఓలా సంస్థ వెల్లడించింది. కస్టమర్లు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, లోన్స్, క్యాష్ ద్వారా ఈ కొత్త స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చని ఓలా సంస్థ తెలిపింది. కాగా ఈ స్కూటర్ కి సంబంధించిన ఈఎంఐలు రూ.2,999 నుంచి ప్రారంభం కానున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack Case: గులకరాయి కేసులో ఏ2 ఎవరు జగన్ సార్.. ఆ నేతలను ఇరికించే కుట్ర జరుగుతోందా?

CM Jagan Stone Attack Case: సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి రాయి దాడి ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో భాగంగా వడ్డెర్ల సతీష్ అలియాస్ సత్తి...
- Advertisement -
- Advertisement -