Teja-Uday Kiran: డైరెక్టర్ తేజ సెన్సేషనల్ కామెంట్స్.. ఉదయ్ కిరణ్ అందుకే చనిపోయాడా?

Teja-Uday Kiran: ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు. అప్పట్లో లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా తెరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్.. ఫస్ట్ సినిమాతో మంచి క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నాడు. యువతను ఆకట్టుకునే సినిమాలతో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. ‘నువ్వు నేను, మనసంతా నువ్వే’ వంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అప్పట్లో లేడీ ఫ్యాన్స్ ఫాలొయింగ్ కూడా ఎక్కువగా ఉండేది.

 

ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అప్పుడే విషిత అనే అమ్మాయిని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. సినీ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోందని అనుకుంటున్న తరుణంలో ఉదయ్ ఆత్మహత్య చేసుకుని అందరిలో విషాదాన్ని నింపాడు. ఇండస్ట్రీతోపాటు అభిమానుల్లోనూ బాధను మిగిల్చాయి.

 

అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సినీ ఇండస్ట్రీలో పలు రకాలు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ వేటికి కచ్చితమైన జవాబులు లేవు. కానీ తాజాగా దర్శకుడు తేజ ఈ విషయం సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు. ఉదయ్ కిరణ్ ఎందుకు హత్య చేసుకున్నాడో తనకు తెలుసని చెప్పాడు. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు తనకు కాల్ చేశాడని, అప్పుడు చాలా విషయాల గురించి చెప్పాడని తేజ అన్నారు.

 

అయితే ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పేంత ధైర్యం లేదని, తాను చనిపోయే లోపు ఆ విషయాన్ని బయట పడ్తానని పేర్కొన్నారు. కాగా, దర్శకుడు తేజ చాలా మంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వీరిలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఉన్నారు. ఉదయ్ కిరణ్‌తో కలిసి దర్శకుడు తేజ ‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే’ వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఉదయ్ కిరణ్ కూడా టాప్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం తేజ దగ్గుబాటి హీరో అభిరామ్‌తో కలిసి ‘అహింస’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts