Telangana Elections: తెలంగాణ ఎన్నికల తేదీ ఫిక్స్.. ఇక యుద్ధం మొదలైనట్టేనా?

Telangana Elections: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సందర్భాలలో ఎన్నికల సమయం ఇదే అంటూ రకరకాల డేట్లు వినిపించినప్పటికీ అవన్నీ కూడా వట్టి వార్తలే అని తేలియింది. ఇది ఇలా ఉంటే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించేదీ అన్న విషయాన్ని ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది.

ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల సీఈవోలు ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లపై దృష్టి పెట్టాల‌ని సూచించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంల‌లో ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వహించరాదని పేర్కంది. ప్రస్తుత పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని, అలా ఉన్న‌వారిని వెంట‌నే అక్క‌డి నుంచి బ‌దిలీ చేయాల‌ని ఆదేశించింది. క్రిమినల్ కేసులు లేవని స్థానిక పోలీస్ స్టేషన్లో డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

 

అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని అధికారులు డిక్లరేషన్ తీసుకోవాలని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో జ‌రిగే బదిలీలు, పోస్టింగ్ లపై జులై 31లోగా త‌మ‌కు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. తెలంగాణ 16. 01.24 తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -