TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో టీ సర్కార్ సంచలన నిర్ణయం

TRS: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలం రేపుతూనే ఉంది. ఈ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. కోర్టులలో వచ్చే తీర్పులు, పోలీసుల దర్యాప్తులో బయటపడే విషయాలు కీలకంగా మారుతోన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు చేపట్టుకోవచ్చని ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ముగ్గురు నిందితులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపణలతో ముగ్గురు నిందితులపై మరో కేసు నమోదు అయింది.

 

 

ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ టీమ్ ను ఏర్పాటు చేయగా.. ఇందులో ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించారు. మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డి, శంసాబాద్ డీసీపీ జగదేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, నల్గొండ ఎస్పీ రెమారాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లను సిట్ టీమ్ లో సభ్యులుగా ఎంపిక చేశారు.

 

అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సిట్ టీమ్ విచారణపై నమ్మకం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్ బృందంతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోన్నారు. కాగా హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డిలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. రూ.50 కోట్లు ఒక్కో ఎమ్మెల్యలకు ఆఫర్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -