Liquor Sales On Dussehra: బాబోయ్ మనుషులేనా? రూ. వందల కోట్ల మందు తాగేశారు!

Liquor Sales On Dussehra: దసరా మద్యం ఏరులైపారింది. తెలంగాణలో గత వారం రోజుల్లో రూ.1,158 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.గత నెల 30న రూ. 314కోట్ల విలువైన మద్యం, బీర్‌ను వ్యాపారులు విక్రయించగా, ఈ నెల 1న రూ. 79కోట్లు, 3న రూ. 140కోట్లు, 4న రూ. 196కోట్లు విక్రయాలు చేశారు.

ఈ నెల 5న అప్పటికే నిల్వ ఉన్న స్టాకును వ్యాపారులు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. 30న 3.66లక్షల పెట్టెల మద్యం, 45వేల పెట్టెల బీర్‌, 1న 46వేల కేసుల లిక్కర్‌, 2.54లక్షల పెట్టెల బీర్‌, 3న 1,09,580 పెట్టెల మద్యం, 2.83లక్షల బీర్‌, 4న 1.78లక్షల లిక్కర్‌, 3.33 లక్షల పెట్టెల బీర్‌ విక్రయాలయ్యాయి. రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టాప్‌ సేల్స్‌ నమోదయ్యాయి. ప్రధానంగా మూడు రోజులపాటు సాగిన దసరా అమ్మకాలు లిక్కర్‌కే ప్రాధాన్యతనివ్వగా, దసరనానాడు బీర్‌ సేల్స్‌ పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రతీరోజు 7 తర్వాత విక్రయాలు జోరుమీద సాగుతున్నాయి.

ఈ ఏడాదిలో మద్యం విక్రయాలు మరింత పెరుగుతాయని భావించిన ఎక్సైజ్‌ శాఖ డిస్టిలరీలకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. దసరా, తాజాగా మునుగోడు ఉప ఎన్నికలు ఇందుకు కారణంగా భావిస్తూ డిస్టిలరీలకు ఉత్తర్వులిచ్చింది. ప్రతీయేటా దసరాకు మూడు రోజులపాటు విక్రయాలు జోరుగా సాగుతాయి. సఘటున ఈ దినాల్లో 27లక్షల బీర్లు, 25లక్షల మద్యం కేసుల విక్రయాలు కొనసాగుతాయని అంచనా. రోజుకు ఇలా రూ. 70నుంచి రూ. 100 కోట్ల మార్కుకు అమ్మకాలు వృద్ధి చెందుతాయి.

గతేడాది అక్టోబర్‌ 14న దసరా సందర్భంగా ముందురోజున రూ. 178కోట్లు, దసరనాకు రూ. 169కోట్ల విక్రయాలు జరగ్గా, గతేడాది 1నుంచి 16 తేదీలలో రూ. 1498కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది రూ. 2వేల కోట్లకు చేరుకున్నాయి. మద్యం దుకాణాలు పెరడంతోపాటు, మద్యం ధరలు పెరిగిన కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి పెరుగుతూ వస్తోంది. ఇక మునుగోడులో పోలింగ్‌ ముగిసే వరకే కాకుండా ఎన్నికల ఫలితాల వరకు ట్రెండ్‌ కొనసాగి మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఇందుకు అనువుగా ఇప్పటికే మద్యం కొరత రాకుండా డిస్టిలరీలకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, డిపోలకు కీలక ఉత్తర్వులు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: భారత్ క్రికెటర్ కంటే వైసీపీ నేత ముఖ్యమా.. పవన్ కళ్యాణ్ విమర్శలు మామూలుగా లేవుగా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై చాలా ఫోకస్ పెట్టారు అవకాశం దొరికితే చాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
- Advertisement -
- Advertisement -