PM Modi: మోదీ వస్తే అగ్నిగుండం అవుతుంది.. తెలంగాణ విద్యార్థులు స్ట్రాంగ్ వార్నింగ్

PM Modi: ఈ నెల 12న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్న విషయం తెలిసిందే. రామగుండంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై రాజకీయ రచ్చ జరుగుతోంది. మోదీ పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ, సీపీఐ నేతలు హెచ్చరిస్తోన్నారు.

 

 

ప్రధాని మోదీ వస్తే రామగుండంను అగ్నిగుండం చేస్తామంటూ తెలంగాణ యూనివర్సిటీ ఐక్య కమిటీ హెచ్చరించింది. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు కూడా మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎల్లుండి నుంచి మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయనున్నట్లు ప్రకటించారు. 8 ఏళ్లుగా తెలంగాణకు మోదీ ఏం చేయలేదని, ఏం మొఖం పెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా మోదీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. మోదీ తెలంగాణ పర్యటన వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు.

 

 

 

అటు తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపారు. కానీ గవర్నర్ తమిళి సై ఇప్పటివరకు బిల్లుకు ఆమోదం తెలపలేదు. దీంతో బిల్లుకు గవర్నర్ రికాల్ చేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తోంది. బిల్లును ఆమోదించకపోవడం వల్ల యూనివర్సిటీలో రిక్రూట్ మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, ప్రొఫెసర్లు కొరత ఉందని తెలిపింది. తక్షణమే యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ ఆమోదించాలని, లేకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటామన్నారు. ప్రధానిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.  తెలంగాణలోని విద్యార్థుల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని, తమకు రావాల్సిన ఉద్యోగులు రాకుండా చేస్తున్నాని ఆరోపించారు. మోదీ తీరు వల్ల చాాలా నష్టం జరుగుతుందన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -