Tollywood: థియేటర్లలో వెయ్యి రోజులకు పైగా ఆడిన సినిమాలు ఇవే!

Tollywood:  ప్రస్తుత కాలంలో చాలా సినిమాలు 50 రోజులకు మించి సినిమాలు థియేటర్లలో ఆడడం లేదు. 75 రోజులు ఆడితే ఆ సినిమా చాలా గొప్ప అని చెప్పవచ్చు. ఒక సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో ఆడితే సినిమా కలెక్షన్ విషయంలో మరో స్థాయిలో పుచ్చుకోవచ్చు. ఇక గతంలో వందరోజులకు పైగా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆ సినిమాలో రికార్డు స్థాయిలో సక్సెస్ ను అందుకున్నాయి.

గతంలో 500 నుంచి 1000 పైగా ఆడిన సినిమాలు కూడా చరిత్రలో ఉన్నాయి. కానీ ప్రస్తుత సినీ రంగంలో రెండు వారాలు థియేటర్లో హడావిడి చేయడమే గగనం గా మారిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఆడితే పది రోజులు మహా అంటే 50 రోజులు ఆడుతున్నాయి. కానీ అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో 1000 రోజులకు పైగా సినిమాలు ఆడిన రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి వివరాలు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ హీరోగా నటించిన లవకుశ సినిమా అప్పట్లో 1111 రోజులు థియేటర్లలో హడావిడి చేసి రికార్డ్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు సి పుల్లయ్య దర్శకత్వం వహించాడు.

అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబోలో వచ్చిన ప్రేమాభిషేకం సినిమా కూడా థియేటర్లో 300 రోజులు హడావిడి చేసింది. ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక థియేటర్లో ఏకంగా 533 రోజులు ఆడిందట.

ఇక ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన వేటగాడు సినిమా కూడా 408 రోజులు థియేటర్లో ఆడింది. అలాగే అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన అడవి రాముడు సినిమా కూడా 365 రోజులు ఆడిందని తెలుస్తుంది.

ఇక అప్పట్లో ప్రేమ సాగరం సినిమా ఏకంగా 465 రోజులు ఆడిందట. ఇక బాలయ్య నటించిన లెజెండ్ సినిమా 1005 రోజులు థియేటర్లో హడావిడి చేసిందట. ఇక మంగమ్మగారి మనవడు 557 రోజులు ఆడిందట. ఇక పోకిరి 1001అలాగే మగధీర 1001 ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లో బాగా హడావిడి చేసాయి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -