Temples: దేవాలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే.. కచ్చితంగా పాటించాలి

Temples: నిత్యం గుడికి వెళ్లి దైవాన్ని దర్శించుకొనే వారు చాలా మంది ఉంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని, జీవితంలో అభివృద్ధి సాధించాలని మొక్కుకుంటూ ఉంటారు. మరోవైపు ప్రశాంతత కోసం కూడా చాలా మంది ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే, గుడికి వెళ్లిన సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు.

ముఖ్యంగా ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణాలు చేయడానికంటే ముందు దేవుడికి మొక్కుకొని తర్వాత ప్రదక్షిణలు చేయాలి. అనంతరం గుడి లోపలికి వెళ్లాలి. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడను, ప్రాకారం నీడను దాటకూడదని పండితులు చెబుతున్నారు. చంచల మనసుతో స్వామిని దర్శించకూడదట. ఆలయంలో దేవుని ఎదుట అబద్ధాలు చెప్పకూడదని పండితులు సూచిస్తున్నారు.

దేవుడు సత్య స్వరూపుడు కాబట్టి గుడిలో అబద్ధాలు చెప్పరాదని సూచిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ దేవాలయంలో దేవుడికి వీపు భాగం చూపిస్తూ కూర్చోకూరాదని చెబుతున్నారు. శివాలయంలో శివునికి నందికి మధ్యలో నడవకూడదని హెచ్చరిస్తున్నారు. ఆలయానికి వెళ్లినప్పుడు వస్త్రంతో లేదా షాలువాతో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలని సూచిస్తున్నారు.

మహిళలు ఇలా చేయరాదు..
ఆలయంలోకి వెళ్లినప్పుడు స్వార్థంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండరాదని చెబుతున్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ దైవంగా భావించి ప్రవర్తించాలని సూచిస్తున్నారు. ఆలయం వెలుపల ఉండే యాచకులకు తోచిన సహాయం చేయాలని చెబుతున్నారు. ఇంటి నుంచి తయారు చేసుకుని తీసుకెళ్లిన ప్రసాదాన్ని పంచి పెట్టాలని, ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. గుడికి వెళ్లేటప్పుడు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి. మహిళలు తప్పక కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పోరాదని చెబుతున్నారు. ఉతికిన బట్టలు ధరించాలి. ఆలయంలో దేవతామూర్తికి ఎదురుగా మొక్కరాదు. ఓ పక్కకు నిల్చొని మొక్కాలని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -