Thagubothu Ramesh: జబర్దస్త్ షోకు తాగుబోతు రమేష్ రెమ్యునరేషన్ అన్ని రూ.లక్షలా?

Thagubothu Ramesh: తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇందులో కమెడియన్లు, క్యారెటర్ ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అయితే వీరిలో చాలా మందికి ప్రాంతీయ తేడాల వల్ల అవకాశాలు రావట్లేదనే పుకారు ఉంది. అయినా, తమ టాలెంట్‌తో అవకాశాల రాబట్టుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. తాగుబోతు రమేశ్‌గా పేరు పొందిన రమేశ్ రామిళ్ల ప్రముఖ తెలుగు కమెడియన్. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖనిలో జన్మించిన రమేష్.. తండ్రి సింగరేణి గనుల్లో కార్మికుడిగా పని చేసేవారు. చిన్నతనం నుంచి తాగుబోతుగా నటించి.. తన గుర్తింపుతోనే తాగుబోతు రమేష్‌గా మారారు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. తాజాగా ‘అనుకోని ప్రయాణం’ సినిమాలో కూడా నటించారు. సినిమాలతో పాటు ‘జబర్దస్త్’ కామెడీ షోలో కూడా అలరిస్తున్నారు.

 

తాజాగా తాగుబోతు రమేష్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. వెండితెరపై అవకాశాలు తగ్గడంతో జబర్దస్త్ షోలో టీమ్ మెంబర్‌గా ఉన్నాడు. తాగుబోతు పాత్రలు చేస్తూ.. తన కామెడీ టైమింగ్స్ తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. అయితే రమేష్‌కు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం తగ్గాయి. కమెడియన్ పాత్రలకు సీనియర్ నటులకు ఛాన్సులు ఎక్కువగా వెళ్తుండటంతో.. తాగుబోతు రమేష్‌కు అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పుకోవచ్చు. అయితే సినిమాల్లో కంటే తక్కువ రెమ్యునరేషన్‌తో జబర్దస్త్ షోలో పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ లో నిజానికి తాగుబోతు రమేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయంపై ఈ రోజు తెలుసుకుందాం..

 

 

రెమ్యునరేషన్ ఎంతంటే?

గతంలో తాగుబోతు రమేష్ టీమ్ లీడర్‌గా చేశారు. కానీ ఊహించిన స్థాయిలో తన స్కిట్‌లతో మెప్పించలేకపోయారు. దీంతో అతడిని వెంకీ మంకీ టీమ్‌కు యాడ్ చేశారు. జబర్దస్త్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 వేల వరకు రెమ్యునరేషన్ ఇస్తారట. ఈ విషయాన్ని మల్లెమాల యాజమాన్యం కూడా ఒప్పుకుంది. అయితే సినిమాల్లో ఎంతో పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న తాగుబోతు రమేష్.. ఇంత తక్కువ రెమ్యునరేషన్‌కు ఎందుకు పని చేస్తున్నావని కుటుంబీకులు, స్నేహితులు ప్రశ్నిస్తున్నారట. దానికి ఆయన ‘నేను రెమ్యునరేషన్ కోసం జబర్దస్త్ షోలో పని చేయడం లేదు. షోలో కనిపించడం వల్ల పాపులారిటీ పెరుగుతుంది. సినిమాల్లో అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే బయట ఈవెంట్స్, షోలలో కూడా అవకాశాలు వస్తాయి.’ అని సమాధానం చెప్పారట.

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -