Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన థాయ్ లాండ్ పోలీసులు.. ఎందుకంటే?

Chikoti Praveen: గత కొంతకాలంగా చికోటి ప్రవీణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అక్రమ సంపాదనవల్ల వార్తల్లో నిలిచిన చికోటి ప్రవీణ్ తాజాగా థాయిలాండ్ లో అరెస్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థాయిలాండ్ ఇండియన్ క్యాంప్లింగ్ ముఠాని అక్కడి స్థానిక పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. థాయిలాండ్ లోని పటాయాలో 90 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

వారిలో కొంతమంది భారతీయులతో పాటు మరికొంతమంది విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 14 మంది మహిళలను కూడా థాయ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

భారతదేశం నుండి గేమ్ ఆడటానికి థాయిలాండ్ చికోటి ప్రవీణ్ మనుషులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్యాంబ్లింగ్ గురించి సమాచారం అందుకున్న థాయిలాండ్ పోలీసులు 90 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

వారిలో చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవ రెడ్డి, దేవేందర్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాంబ్లింగ్ ముఠా నుండి థాయిలాండ్ పోలీసులు దాదాపు 20 కోట్ల విలువ చేసే గేమింగ్ చిప్స్ మరియు భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా చీకోటి ప్రవీణ్ గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. చికోటి ప్రవీణ్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయ ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి.

 

గతంలో కూడా ఇటువంటి గ్యాంబ్లింగ్ విషయంలో చికోటి ప్రవీణ్ మీద వార్తలు వినిపించాయి. అంతేకాకుండా జంతు ప్రేమికుడైన చికోటి ప్రవీణ్ తన ఫామ్ హౌస్ లో వివిధ రకాల పక్షులు జంతువులను పెంచుతున్నాడు. ఈ క్రమంలో వాటిని అక్రమంగా బంధించినట్లు అతని మీద కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మరొకసారి థాయిలాండ్ లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -