SS Thaman: బోయపాటి, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు తమన్ రెమ్యూనేషన్ ఎంతో తెలుసా?

SS Thaman: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరో రామ్ పోతినేని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో రామ్ హడావిడి చేస్తున్నాడు. ఇక హీరో రామ్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇక రామ్ పోతినేని సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఇక డైరెక్టర్ బోయపాటి, రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీనికోసం బోయపాటి ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇదివరకే తమన్ సరైనోడు, అఖండ సినిమాలు బోయపాటితో కలిసి చేశాడు. ఇక ఈ సినిమాలు బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న రామ్ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పారితోషకాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ముఖ్యంగా తమన్ అయితే ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి తమన్ గతంలో సినిమాలకు రెండు కోట్ల వరకు తీసుకునేవాడట. కానీ ఆఖండ భారీ స్థాయిలో విజయం సాధించడంతో అతడు రెమ్యూనేషన్ విలువ మూడు నుంచి ఐదు కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తుంది.

కాగా ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో అతడి సంగీతాన్ని కూడా అదే స్థాయిలో అందిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ పోతినేని సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. కాబట్టి దీనికిగాను తమన్ ఐదు కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని కొన్ని సమాచారాల ద్వారా తెలుస్తుంది. అయితే తమన్ సర్కారు వారి పాట సినిమాలో తన సంగీతాన్ని ప్రేక్షకులకు మరో స్థాయిలో పరిచయం చేసాడు. ఈసినిమాకి కూడా తమన్ ఐదు కోట్ల వరకు పుచ్చుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -