Samantha: సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Samantha: సమంత తెలుగు చలనచిత్ర నటిగా అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగు,తమిళ భాషలలో నటించడం జరిగింది. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. 2010లో ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా మంచి గుర్తింపు, ప్రశంసలు పొందింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని సంచలన విషయాలు ఇంటర్వ్యూ తో పంచుకోవడం జరిగింది. తాను చదువుకునే రోజుల్లో కేవలం పాకెట్ మనీ కోసమే సరదాగా మోడలింగ్ చేశానని తెలిపింది.

ఈమె డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మినన్ ను చూడాలని మాత్రమే ఆఫీసుకు వెళ్లిందట. ఆడిషన్ కోసం కాదు అని తెలిపింది. ఆ తర్వాత ఆయన సెలెక్ట్ చేసి సినిమా చేస్తారా అంటే వెంటనే ఓకే చెప్పేసిందిట. ఆ డైరెక్టర్ అంటే ఎంతో అభిమానం అని అందుకే ఆయనను చూడాలి అనుకున్నాను కానీ ఆయనే సినిమాలో నటిస్తారా అనేసరికి సినిమా కథ వినకుండానే ఓకే చెప్పడం జరిగింది అని తెలిపింది.

ఇక షూటింగ్లో కూడా ఏ రోజు సీన్ ఆ రోజే వినేదానినని, మొదటి రోజు షూటింగ్లో చాలా భయపడి చేతులు కూడా వణకడం జరిగింది. మొదటి రోజు షూటింగ్లో పొందిన అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపింది. ఇక అందులో ఉండే జెస్సి పాత్ర తన నిజ జీవితానికి వ్యతిరేకంగా ఉండడం కూడా కాస్త ఎక్సైజ్మెంట్ ఫీల్ అయినట్లు తెలిపింది.

తమ ఇంట్లో చిన్నప్పటినుండి కాస్త స్ట్రీట్ గా పెరిగానని, నా పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెషనల్ లైఫ్ కు కాస్త డిఫరెంట్ ఉందని చెప్పడం జరిగింది. కానీ తాను సినిమాల ద్వారా వ్యక్తిత్వాన్ని మార్చుకోనని, సినిమాలకు రాకముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటానని తెలపడం జరిగింది. మొదటి సినిమా తన అభిమాన డైరెక్టర్ గౌతమ్ తో చేస్తానని కలలో కూడా అనుకోలేదు అని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -