Bandi Sanjay Kumar: క్షుద్రపూజలకు అడ్డగా కేసీఆర్‌ ఫాంహౌస్‌: బండి సంజయ్‌

Bandi Sanjay Kumar: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ పేరు మార్పుపై ప్రతి పక్షాలు వివిధ రకాలుగా విమర్శలు, ఎద్దేవా చేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు సంజయ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.సీఎం కేసీఆర్‌ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు సూచించడంతోనే బీఆర్‌ఎస్‌ పేరు మార్చారని బండి సంజయ్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ పద్ధతి గతంలో కూడా ఉందని, సచివాలయానికి వెళ్తే ఓటమి తప్పదని చెప్పడంతో అక్కడికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదన్నారు. ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్, ఆ అస్తికలను కలపడానికి కాళేశ్వరానికి సకుటుంబ సమేతంగా వెళ్లారని పేర్కొన్నారు.అంతేకాక నల్ల పిల్లితో పాంహౌజ్‌లో కేసీఆర్‌ తాంత్రిక పూజలు చేస్తాడని, అయితే ఆయన క్షుద్ర పూజలు ఫలించకుండా పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చిందని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లోనూ గెలవడానికి కూడా కేజీఆర్‌ క్షుద్ర పూజలు చేశారని.. అయినా అక్కడ ఆయన క్షుద్ర పూజలు ఫలించలేదన్నారు.

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని.. సీబీఐ, ఈడీ తమను వేధిస్తున్నాయని కేటీఆర్‌ కూడా చెప్పారని చెప్పుకొచారు.ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్‌ దోపిడీని ప్రస్తావిస్తున్నారని రేవంత్‌ అన్నారు. అయితే, అసలు విషయం ఇది కాదని, ఢిల్లీ హైకోర్టులో పూర్తి వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని, 2018లో ఎలక్షన్‌ కమిషన్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు.గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారని, రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరు, అలా చేయడం లంచం తీసుకోవడంతో సమానం. కేంద్ర ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం రూ. 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు.

కాగా, గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదు కాబట్టి.. టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని రేవంత్‌ చెప్పారు. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్‌కు ఈసీ ఇప్పటికే లేఖ రాసిందని, సరైన చర్యలు తీసుకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ రద్దుఅవుతుంది కాబట్టే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ మార్చుకుంటున్నారని రేవంత్‌ వెల్లడించారు. కేవలం కేసుల భయంతో వ్యూహాత్మకంగానే కేసీఆర్‌ పార్టీ పేరు మారుస్తున్నారని ఆరోపించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -