తల్లి కూతుళ్లపై ఆ దుర్మార్గుడు అరాచకం!

ఇటీవల అక్రమ సంబంధాలు కొనసాగించేవారు ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. వివాహ బంధంతో ఒక్కటైన జంట కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతున్నారు. మరికొంత మంది అక్రమ సంబంధాలతో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుని వరకు వెళ్తున్నారు. భర్త చనిపోవడంతో ఆరేళ్ల కూతురితో ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.. అది ఆ పరిచయంతో ఇద్దరు సహ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ సహజీవనం ఆరేళ్ల చిన్నారి జీవితాన్ని బలి తీసుకుంటుందని ఆ తల్లి ఊహించలేదు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.

 

కామారెడ్డి జిల్లా కు చెందిన కొంత మంది వ్యవసాయ కూలీలు ఇటీవల డిచ్‌పల్లిలో పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవిస్తున్నారు. ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఆరేళ్ల కూతురు తో అక్కడే జీవిస్తుంది. ఈ క్రమంలో గోవింద్ రావు అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో అతనితో సహజీవనం చేస్తూ వస్తుంది. ఆ కామాందుడి కన్ను ఆరేళ్ల పాపపై పడింది. ఈ నెల 20న ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. దీంతో ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలిక తల్లి వచ్చి పాపను హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గత నెల 23న చనిపోయింది.

 

గోవిందరావు అత్యాచారం చేయడం వల్ల పాప మృతి చెందిన విషయం తెలిస్తే తనకు జైలు శిక్ష ఖాయం అనుకుని బాలిక తల్లిని ఏమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకునే సమయంలో సహజ మరణం అని చెప్పమన్నాడు. అతను చెప్పినట్లే చేసింది పాప తల్లి. ఇలా తన కన్నింగ్ ప్లాన్ తో పాప తల్లిని మభ్యపెడుతూ వచ్చాడు. కానీ గోవింద్ రావు పాపం పండింది.. పోస్ట్ మార్టంలో పాపపై గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి తనదైన రీతిలో విచారించగా తాను అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో గోవింద్ రావుపై అత్యాచారం, హత్య తో పాటు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts