Marriage: మరో పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న నటి..ప్రేమించేవాడి కోసం చూస్తున్నా

Marriage: సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పలు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ 4 ద్వారా ఆమె ఆడియన్స్ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముక్కుసూటిగా, గంభీరంగా మాట్లాడే కరాటే కళ్యాణి తన మనసులో ఎన్నో బాధలను దాచుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయాల గురించి, తన మాజీ భర్త ప్రవర్తన గురించి పలు విషయాలను తెలిపారు.

బతుకుదెరువు కోసం సినిమాల్లోకి వచ్చానని కరాటే కళ్యాణి అన్నారు. తాను సినిమా అవకాశాల కోసం అనేక ప్రాంతాలు తిరిగానని, తనకు సినిమా ఛాన్సులు అంత తేలిగ్గా రాలేదని తెలిపారు. సినిమా క్యారెక్టర్ లో లాగా తనను చాలా మంది బాబీగానే చూశారని, కానీ తన నిజ జీవితంలో పడిన కష్టాలు ఎవ్వరూ పడుండరని భావోద్వేగమయ్యారు.

తన జీవితంలో తాను చాలా మందికి సహాయం చేశానని, కానీ తనకు మాత్రం సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని అన్నారు. తన వ్యక్తిగత జీవితానికి వస్తే తాను పెళ్లి చేసుకున్నాక తన జీవితమే మారిపోయిందని తెలిపారు. తన భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయేదాన్ని అని కంటతడి పెట్టుకున్నారు. తనకు టార్చర్ ఎలా పెట్టేవాడంటే..ఒకసారి బేగంపేట నడి వీధిలో తనను బట్టలు లాగేసి ఘోరంగా ప్రవర్తించాడని వెల్లడించారు.

అందరూ చూస్తుండగానే తనపై తన భర్త నీచంగా ప్రవర్తించాడని, ఇక తన భర్తతో భరించలేక విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే జీవిస్తున్నానని, ప్రేమించి మరో పెళ్లి చేసుకోవాలని ఉందని కరాటే కళ్యాణి తెలిపారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -