Karimnagar: ప్రేమించిన ప్రియుడే ప్రియురాలిని అలా.. చివరికి?

Karimnagar: ఈ మధ్యకాలంలో చాలామంది పురుషులు అమ్మాయిల వెంట ప్రేమించమంటూ వెంటపడుతున్నారు. తీరా ప్రేమించిన తర్వాత అనుమానం, అనుమానాలతో వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకి ఒకరినొకరు చంపుకోవడం దూషించుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. అంతే కాకుండా రెప్పపాటి కాలంలోనే ఊహించని దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలా యువత ప్రేమ పేరుతో వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి మరొకటి వెలుగులోకి వచ్చింది.

పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రియుడు చివరి నిమిషంలో మాట మార్చడంతో ఊహించిన విధంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రెడ్డి రజిత అనే 19 ఏళ్ళ యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే రజిత కీ చదువుకునే రోజుల్లో మల్లాపూర్ గ్రామానికి చెందిన పల్లె వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అలా వీరిద్దరూ దాదాపు మూడేళ్ల పాటు ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఇదే విషయం యువతి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలంటూ వెంకటేష్ ను కోరారు.

 

మొదట్లో వ్యతిరేకించిన కట్నం ఆశతో చేసుకుంటానని తెలిపాడు. అయితే ఇరువురి తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి బట్టలు కూడా కొన్నారు. కానీ ఉన్నట్టుండి వెంకటేష్ రజిత తో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు.. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన రజిత ఏప్రిల్ 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తాజాగా రజిత శుక్రవారం మృతి చెందింది. కూతురు మరణంతో రజిత తల్లిదండ్రులు గుండెలు విలసిలా రోదిస్తున్నారు. అనంతరం రజిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -