NTR: ఆ హీరో ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లకు ఫిదా కావాల్సిందే!

NTR: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తాజాగా విక్రమ్ వేద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో నెగటివ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఈయన పాత్రకు ఐ ఫాలో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలోనే అబుదాదిలో జరుగుతున్నటువంటి ఈ అవార్డు ఈ వెంట్ కి హృతిక్ రోషన్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ మీడియాతో మాట్లాడుతూ హృతిక్ రోషన్ తన తదుపరి విషయాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ తాను నటిస్తున్న ఫైటర్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తుందని తెలియజేశారు. ఇక తన తదుపరి చిత్రం వార్ 2 షూటింగుకు సిద్ధమవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో తాను ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి చాలా ఎక్సైట్ గా ఫీలవుతున్నానని హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి ఐఫా వేడుకలలో ప్రస్తావించడం విశేషం. ఇక వార్ 2 లోఎన్టీఆర్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 

ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా ఈ విషయం గురించి హృతిక్ రోషన్ ఇదివరకే వెల్లడించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హృతిక్ రోషన్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా యుద్దభూమిలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సినిమా గురించి ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

 

ఇలా ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా హృతిక్ రోషన్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఇలాంటి కామెంట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ వార్ 2 లో బిజీ కానున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -