The Couple: ఆ దంపతులకు వినికిడి లోపం.. ఆ వ్యాపారంలో దూసుకుపోతున్నారు!

The Couple: మనిషి బతకాలంటే ఏదైనా పని చేయాల్సిందే. కొందరికి అన్ని బాగానే ఉన్నా సోమరితనం సాకులు చెబుతూ.. పని చేయాకుండా ఖాళీగా తిరుగుతుంటారు. మరి కొందరు అవిటి వారైనా కూడా తాము బతకాలంటే ఏదైనా చేయాలనే తపనతో ఏదైనా ఒకటి చేస్తూనే జీవితం గడుపుతుంటారు. మనిషి వద్ద ట్యాలెంట్‌ ఉండి.. తాము చేయగలమనే కసి ఉంటేనే దేౖనైనా సాధిస్తారన డానికి ఈ దంపతులే ఆదర్శం. మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా కానీ.. కేవలం సైఔగలతోనే తమ వ్యాపారాన్ని నడిపిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో మూగ చెవుడు ఉన్న దంపతులు తమకు జీవితంలో ఎదురైన సవాళ్లను చాలా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటున్నారు. సదా చిరునవ్వు ముఖంతో వాటిని అధిగమిస్తున్నారు. ఈ జంట పానీపూరీ స్టాల్‌ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో.. దంపతులు ఇద్దరూ తమ స్టాల్‌ వద్ద సైగలను చేస్తూ కస్టమర్స్‌ కు ఆహారపదార్ధాల గురించి వివరిస్తున్నారు. ఈ జంట కస్టమర్‌లతో సైగలతో అనుసంధానం చేస్తున్నారు. తమ బండి దగ్గరకు వచ్చే కస్టమర్స్‌కు ఏం కావాలన్నా సైగలతోనే అడుగుతారు. ఈ వీడియోలో మహిళ సంజ్ఞలను ఉపయోగించి మసాలా ఎక్కువ అయిందా.. సరిపోయిందా అంటూ కస్టమర్‌ని అడగడం చూడవచ్చు. ఆమె కరకరలాడే పూరీలకు రుచిగల పుదీనా వాటర్‌ ను జోడించి..ఆ నోరూరించే ప్లేట్‌ను కెమెరాకు చూపుతుంది.

నాసిక్‌లోని అడ్గావ్‌ నాకా సమీపంలో ఉన్న స్టాల్లో ఈ చెవిటి, మూగ జంట జీవనోపాధిగా చిన్న పానీ పూరీ స్టాల్‌ను నడపడానికి నిర్ణయించుకున్నారు. తమకున్న లోపాలను అధిగమించి వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. వారు ఈ స్టాల్‌ లో అందిస్తున్న ఆహార పదార్థాలన్నీ ముందుగానే ఇంట్లోనే తయారు చేస్తారు. చివరికీ పానీ పూరీలు కూడా. అంతేకాదు.. తాము కస్టమర్స్‌ కు ఆహారాన్ని అందజేసేటప్పుడు పరిశుభ్రతను పాటిస్తారు. ఈ జంట నుంచి నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -