Pawan Kalyan: పవన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఫ్యాన్.. ఖర్చు ఎంతంటే?

Pawan Kalyan: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. పవర్ స్టార్ ఏ సినిమా తీసినా అది బంపర్ హిట్ కొట్టక మానదు. పవన్ సినిమా విడుదలైందంటే చాలు అభిమానులకు పండగ వచ్చినట్లు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మెగా ఫ్యాన్స్ కు పవన్ చచ్చేంత ఇష్టం. మెగా స్టార్ నట వారసుడిగా పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు.

పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూ ఇటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. జనసేన పార్టీతో ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. సాధారణంగా తమ అభిమాన సినీ హీరో లేదా రాజకీయ నేతల మీద ఫ్యాన్స్ చాలా రకాలుగా అభిమానాన్ని చూపుతూ ఉంటారని చెప్పడంతో అతిశయోక్తి లేదు. తమకు నచ్చిన హీరోలపై పూల వర్షం కురిపించడం, ఆ హీరోల ఫ్లెక్సీలకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం వంటివి అభిమానులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమాని కూడా సుమారు రూ.1.40 లక్షలు ఖర్చు పెట్టి పవన్ విగ్రహాన్ని నెలకొల్పాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక అభిమాని పవన్ కల్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకోవడం విశేషం.

ఏడున్నర అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటుతో పవన్ అభిమానులు ఆనందంతో పులకించిపోతున్నారు. గబ్బర్ సింగ్‌‌గా పవన్‌కు అచ్చొచ్చిన రెడ్ టవల్‌ను నడుముకు చుట్టించి, మెడలో జనసేన కండువాతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ విగ్రహం పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -