Kurnool: అందరిముందే అల్లుడిపై దారుణానికి ఒడిగట్టిన మామ?

Kurnool: ఈ మధ్యకాలంలో చంపడం చావడం అన్నది సర్వసాధారణమైపోయింది. చాలామంది ఎదుటి వ్యక్తులను చంపడాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఎదుటి వ్యక్తిని ఎంతో సునాయాసంగా కొట్టి చంపేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా కర్నూలు జిల్లాలో కూడా అటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా దేవన కొండ మండలం పి.కోటకొండలో తాజాగా జాతర జరగగా ఆ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు, భక్తులుతరలి వచ్చారు. ఇక అందరూ జాతర సంబరాల్లో మునిగితేలుతున్నారు.

 

ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక ఊహించని దారుణమైన ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ చూస్తుండగా సూర్యప్రకాశ్ అనే వ్యక్తిని తన మామ లింగమయ్య కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. అకస్మాత్తుగా మామ వచ్చి కత్తితో దాడి చేయడంతో సూర్యప్రకాశ్ దాడిలో కుప్పకూలి చనిపోయాడు. సూర్య ప్రకాష్ భార్య ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణీ. అయితే సూర్య ప్రకాష్ ని అతని మామ చంపడానికి గల కారణం గత కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోని లింగమయ్య అల్లుడు సూర్య ప్రకాష్ పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఎలా అయినా జాతరలో అల్లుడిని చంపాలి అనుకున్నా మావయ్య లింగమయ్య అనుకున్న విధంగానే అల్లుడిని కత్తులతో దాడి చేసి చంపేశాడు. అయితే సూర్యప్రకాష్ మరొక అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే లింగమయ్య సూర్యప్రకాష్ ని హత్య చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా తన కుమార్తెను వేధిస్తున్నాడని సూర్యప్రకాష్ మామ కోపం పెంచుకున్నాడు. గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇటీవలే సూర్యప్రకాష్ లింగమయ్య ఇంటికి వచ్చి తన భార్యను తీసుకెళ్తానని కుటుంబ సభ్యులను అడిగగా అప్పుడు కుటుంబ సభ్యులు జాతర ఉందని జాతర అయిపోగానే పంపుతామని వారు చెప్పారట. ఈ క్రమంలోనే మాటామాట పెరిగి ఘర్షణ జరిగిందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -