Bahraich: తాంత్రికుడి మాటలు నమ్మి కొడుకుని బలిచ్చిన తండ్రి?

Bahraich: టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మూఢనమ్మకాలు వీడలేదు. ఈ మూఢనమ్మకాల వల్ల ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా ఈ మూఢనమ్మకాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్న కూడా మూఢనమ్మకాలను మాత్రం విడిచి పెట్టడం లేదు. మరి ముఖ్యంగా మారుమూల పల్లెటూళ్లలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన కూడా సమాజంలో మూఢనమ్మకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్‌ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తికి వివేక్‌ వర్మ పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణవర్మకు అదే గ్రామంలో అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్‌కు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు పుట్టినప్పటి నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో అనూప్‌ ఎందరో వైద్యులను సంప్రదించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనూప్ ఓ తాంత్రికుడిని సంప్రదించాడు.

 

నరబలి చేస్తే కొడుకు ఆరోగ్యం బాగుటుందని ఆ తాంత్రికుడు అనూప్‌కు తెలిపాడు. తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్‌ మేనమామ చింతారామ్‌తో కలిసి గురువారం రాత్రి వివేక్‌ వర్మను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్యచేసి పరారయ్యాడు. కొడుకు వివేక్‌ కనిపించలేదంటూ తండ్రి కృష్ణవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడికోసం కోసం గాలింపు చర్యలు చేపట్టగా అదే రోజు ఇంటి సమీపంలోని పొలాల్లో వివేక్‌ వర్మ మృతదేహం లభ్యమైంది. ఇక పోలీసులు వారి స్టైల్ లో విచారణ జరుపగా తాంత్రికుడితోపాటు అనూప్‌, అతనికి సహకరించిన చింతారామ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఇక కొడుకులు వివేక్ వర్మ మరణ వార్త వినీ కుటుంబ సభ్యులు గుండెలు విలసేలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -