The Ghost Collections: ‘ది ఘోస్ట్’ ఫస్ట్ డే కలెక్షన్స్

The Ghost Collections: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాను ఆసక్తికరంగా మలిచాయి. అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ కానుకగా బారి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ది ఘోస్ట్‘ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజంలో 57 లక్షలు, సీడెడ్ లో 24 లక్షలు, ఉత్తరాంధ్ర 31 లక్షలు, ఈస్ట్ లో 23 లక్షలు, వెస్ట్ లో 8 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 20 లక్షలు, నెల్లూరులో 15 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా చూసుకుంటే రెండు కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో కేవలం 20 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది.

యూఎస్ లో అతి తక్కువగా 25 లక్షల షేర్ దక్కింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ది ఘోస్ట్ సినిమా 2.45 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం నిజంగా దారుణమనే చెప్పాలి.

ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -