The Ghost Movie Review: ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ : అక్టోబర్5, 2022

నటీనటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, అను, రవివర్మ

నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పీ

నిర్మాతలు : శరత్ మరార్, పుష్కర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

సంగీతం : మార్క్ కే రాబిన్, భరత్ సురభ్

ఎడిటర్ : ధర్మేంద్ర కాకర్ల

సినిమాటోగ్రాఫర్ : జి.ముఖేష్

The Ghost Movie Review and Rating

బంగార్రాజు సినిమాతో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను, బ్రహ్మాస్తం సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న నాగార్జున ఈరోజు ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్లు మరీ క్లాస్ గా ఉండటంతో బుకింగ్స్ మరీ భారీ స్థాయిలో లేకపోయినా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు బుకింగ్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించిన ది ఘోస్ట్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం.

విక్రమ్(నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఎన్నో ఆపరేషన్స్ ను నిర్వహిస్తూ వాటిని సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా పని చేసే ప్రియ(సోనాల్ చౌహాన్) విక్రమ్ మధ్య ప్రేమ మొదలై వీళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే ప్రతి ఆపరేషన్ లో సక్సెస్ అయిన విక్రమ్ ఒక ఆపరేషన్ లో మాత్రం ఫెయిల్ కావడంతో పాటు ఒక పిల్లాడు చనిపోవడానికి పరోక్షంగా రీజన్ కావడంతో తన జాబ్ కు రిజైన్ చేస్తాడు.

కొంతకాలం ఒంటరిగా జీవితం గడిపిన విక్రమ్ కు అను(గుల్ పనాగ్) నుండి ఫోన్ వస్తుంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తన కూతురిని చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని అను విక్రమ్ తో చెబుతుంది. అయితే విక్రమ్, అను మధ్య రిలేషన్ ఏమిటి? అను సమస్యను విక్రమ్ పరిష్కరించాడా? విక్రమ్ ను చూసిన వెంటనే శత్రు వర్గాలు ఘోస్ట్ లా ఫీలవ్వడానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది ఘోస్ట్ మూవీ కథ అని చెప్పవచ్చు.

నాగార్జున ఈ తరహా పాత్రలలో నటించడం కొత్తేమీ కాదు. గతంలోనే ఇలాంటి పాత్రలలో నటించిన నాగ్ ఆ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. కార్పొరేట్ క్రైమ్ అనే కొత్త పాయింట్ ను యాడ్ చేసిన కథతో ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కించగా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంది.


విశ్లేషణ : నాగార్జున విక్రమ్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. నాగార్జున కాకుండా మరెవరు ఈ పాత్రలో నటించినా ది ఘోస్ట్ మూవీకి న్యాయం జరిగేది కాదు. సోనాల్ చౌహాన్ తన పరిధి మేర మెప్పించారు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మనీష్ చౌదరి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే మ్యూజిక్ ఆశించిన రేంజ్ లో లేకపోయినా బీజీఎం బాగుంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ సీన్ కు కమల్ హాసన్ విక్రమ్ స్పూర్తి అయినా ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశం కాకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున నటన

నిర్మాణ విలువలు

యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశం కాకపోవడం

ఫస్టాఫ్ లోని కొన్ని సన్నివేశాలు

మ్యూజిక్

ఎడిటింగ్

రేటింగ్ : 3/5

బాటమ్ లైన్ : క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే “ది ఘోస్ట్”

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -