The Ghost Trailer: ఆకట్టుకుంటోన్న నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైలర్

The Ghost Trailer: మన్మథుడిగా మనమందరం పిలుచుకునే అక్కినేని నాగార్జున యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలతో కలిసి కూడా సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ ఓరియెంటెండ్ సినిమాలతో పాటు మరోవైపు డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో యాక్షన్ సినిమాతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

గరుడ వేగ సినిమాతో హీట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో భారీ యాక్షన్ సినిమా నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ది హోస్ట్అనే సినిమా టైటిల్ పెట్టగా.. తాజాగా ఈ సినిమా టైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1 నిమిషం 53 సెకన్ల పాటు ఈ ట్రైలర్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నాగార్జున లుక్ చాలా కొత్తగా ఉంది. ఇందులో రా ఏజెంట్ పాత్రలో నాగార్జున నటించినట్లు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అక్కన కాపాడటానికి నాగార్జున ఏం చేశాడు… కిడ్నాపర్లు, గ్యాంగ్ స్టర్లను ఎందకు చంపాలనకున్నాడు అనేది సినిమాలో చూపించనున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనన్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. ఈ సినమాపై నాగార్జున అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున పాత్ర పేరు విక్రమ్ అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇందులో రొమాన్స్ సీన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు కలిపి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో నాగార్జున హిట్ అందుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -