Viral: వైరల్ అవుతున్న హృదయ విదారక దృశ్యం.. ఒక తండ్రి కన్నీటి కష్టమిదే!

Viral: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో వందల మంది మరణం పొందగా వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాలు పాలయ్యారు. అతి భయంకరమైన ఈ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో కొన్ని వందల కుటుంబాలలో శోకం మిగిలిందని చెప్పాలి. తమతో పాటు ప్రయాణించిన తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియక కొందరు వారికోసం వెతుకుతూ ఉండగా మరికొందరు ఆ రైలులో ప్రయాణిస్తున్న తమ బంధువుల ఆచూకీ కోసం పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఘోర రైలు ప్రమాదం అనంతరం భద్రక్‌ జిల్లా సుగొ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు హుటాహుటిన బాలేశ్వర్‌ చేరుకుని తమ కొడుకు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కొడుకు ఆచూకీ తెలపండి అని అధికారులను అడిగిన ఫలితం లేకుండా పోయింది అలాగే సంఘటన స్థలంలో తన కొడుకు కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది.

 

తన కుమారుడి ఆచూకీ ఎవరు తెలియచేయకపోవడంతో ఆ వృద్ధుడు ఈ ఘటనలో చనిపోయిన మృతదేహాల మధ్య తన కుమారుడి కోసం వెతుకుతున్నటువంటి ఘటన అందరిని ఎంతగానో కలిచి వేసింది. చనిపోయిన ఒక్కోమృతదేహం ముసుగు తొలగించి తన కుమారుడు ఎక్కడున్నాడు వెతుకుతున్నటువంటి ఈ ఘటన అందరి హృదయాలను ఎత్తగానో బాధించింది. ఇలా మృతదేహాల మధ్య తన కొడుకు ఆచూకీ వెతికిన దొరకకపోవడంతో ఆ వృద్ధుడు తన కొడుకు ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు.

 

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ హృదయ విదారక ఘటన చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇలాంటి శోకం ఏ కన్నతల్లి తండ్రులకు రాకూడదు భగవంతుడా అంటూ ప్రార్థిస్తున్నారు. ఇలా ఈ రైలు ప్రమాద ఘటనలో ఎంతోమంది చనిపోగా గాయాలు పడిన వారందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరందరూ కూడా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -