Nani: నా ఆఫీస్‌లో ఆ హీరో హీరోయిన్ రొమాన్స్ చేస్తున్నారు: నాని

Nani: న్యాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఆఫీస్‌లో హీరోయిన్‌తో ఓ హీరో రొమాన్స్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నానినే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌తో తెలియజేశాడు. అయితే నాని చెప్పిన ఆ హీరో హీరోయిన్ ఎవరని మీకు డౌట్ వస్తోందా? అతనే యంగ్ హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే ఈ ఇద్దరు హీరో హీరోయిన్‌లు నాని ఆఫీస్‌లో ఏం చేస్తున్నారనే ప్రశ్న మీలో రావొచ్చు.

 

వీరిద్దరితో కలిసి నాని ఓ సినిమా తీశాడు. అదే ‘హిట్-2’. ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అతి త్వరలో థియేటర్ల ముందుకు రానుంది. సినిమా విడుదల దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రయోషనల్ ఈవెంట్స్ భారీగా నిర్వహిస్తోంది. అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లు హీరోయిన్ మీనాక్షి చౌదరితో హీరో అడివి శేష్ రొమాన్స్ చేస్తూ దొరికేశాడు.

 

 

దీనిపై నాని స్పందించాడు. ట్విట్టర్‌ వేదికగా వీరు చేస్తున్న అల్లరిని తెలుపుతూ.. ‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా?’ అని ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. కాగా, హిట్-2 సినిమాకు సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఊహించిన విధంగానే ట్రైలర్‌కు భారీగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిట్-2 చిత్ర బృందం సినిమాకు సంబంధించి ఓ సాంగ్‌ను కూడా విడుదల చేసింది.

 

‘ఈ సాంగ్ మీకు బాగా నచ్చుతుంది. సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేయండి.’ అని అడివి శేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ పాటను ప్రముఖ సింగర్ ‘సిధ్ శ్రీరామ్’ వాయిస్ అందించారు. పాట కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ పాట మీదే అడివి శేష్, మీనాక్షి చౌదరి.. నాని ఆఫీస్‌లో స్టెప్పులు వేశారు. అప్పుడు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అది చూసిన నాని కూడా సరదాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -