చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇద్దరు కుమారులు కూడా సుపరిచితమే. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన సినిమా ‘హాయ్’. ఈ సినిమాలో హీరోయిన్ నిఖిత తుక్రాల్‌గా నటించారు. ఈ సినిమాతోనే నిఖిత తుక్రాల్ చిత్ర పరిశ్రమకి తెరంగ్రేటం చేసింది. ఆమె చాలా సినిమాలో నటించినప్పటికి సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత హీరో నితీన్‌తో కలిసి సంబరం సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. నిఖిత హీరోయిన్‌గానే కాకుండా విలక్షణ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను నుండి మంచి ఆదరణ పొందింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నిఖిత తుక్రాల్ నటించిన సినిమాల కన్నా కాంట్రవర్సీలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ కన్నడ హీరో దర్శన్‌తో లవ్ ఎఫైర్ గురించి తెలియడంతో ఏకంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. అయితే నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడానికి ముందు.. ఆమె దర్శన్‌తో ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా సమయంలో ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రిలేషన్‌లో ఉండిపోయారు. హీరో దర్శన్‌కి అప్పటికే వివాహం జరిగింది. దీంతో నిఖిత కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇక ఆ గొడవలు ఎంతవరకు వెళ్లాయంటే తాగిన మత్తులో తన భార్యపై దర్శన్ గన్ను పెట్టేవరకు తీసుకెళ్లింది.
దీంతో దర్శన్ భార్య అతడిపై పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్శన్‌ని అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్ పంపించిన విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిపోయింది. ఈ పరిణామంతో కన్నడ ఇండస్ట్రీ నిఖితపై చర్యలు తీసుకుని ఆమెను మూడేళ్ళ పాటు కన్నడ సినీ పరిశ్రమ నుండి బ్యాన్ చేశారు. ఇండస్ట్రీ బ్యాన్ చేయడంతో నిఖిత డిప్రెషన్‌కు లోనయ్యి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. దీంతో కన్నడ నటీనటులు నిఖితకు మద్దతు ఇచ్చారు. ఈ సమస్య పెద్దది అయితే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండటంతో పరిశ్రమ పెద్దలు నిఖితపై ఉన్న బ్యాన్ ని మూడురోజుల్లో ఎత్తేశారు.